30, జులై 2021, శుక్రవారం

April 1 Vidudala : Maatante Maatenanta Song Lyrics (మాటంటే మాటేనంటా)

చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991)

సంగీతం :  ఇళయరాజా

సాహిత్యం :  వెన్నెలకంటి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా... నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంట గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా ఎవరంటే నాకేమంటా తప్పులుంటె ఒప్పనంట నీ వెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంటా నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా జణక్కు జుమ్మ... మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంతా అంటా మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంట చరణం 1: నువ్వే మా మొదటి గెస్టని.. మా ఆవిడ వంట బెస్టని ఈ ఫీస్టుకి పిలుచుకొస్తినీ... టేస్టు చెప్పి పోరా ఇదే మా విందుభోజనం మీరే మా బంధువీదినం రుచుల్లో మంచి చెడ్డలూ ఎంచి తెలుపుతారా.. అపార్ధం చేసుకోరుగా... అనర్ధం చెయ్యబోరుగా యదార్ధం చేదుగుంటది... పదార్ధం చెత్తగున్నదీ ఇది విందా నా బొందా... తిన్నోళ్ళూ గోవిందా జంకేది లేదింక నీ టెంక పీకెయ్యగా.. పదర కుంకా.. నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంటా గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా ఎవరంటే నాకేమంటా తప్పులుంటె ఒప్పనంట నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా చరణం 2 : భళారే నీలి చిత్రమా భలేగా... ఉంది మిత్రమా ఇలా రసయాత్ర సాగదా.. పక్కనుంటె భామా కోరావూ అసలు ట్రూతును... చూపాను సిసలు బూతును చిక్కారూ తప్పుచేసి ఇక మక్కెలిరగదన్నూ తమాషా చూడబోతిరా... తడాఖా చూపమందురా మగాళ్ళని ఎగిరిపడితిరా... మదించీ మొదలు చెడితిరా సిగ్గైనా ఎగ్గైనా లేకుండా దొరికారా ... లాకప్పు పైకప్పు మీకిప్పుడే చూపుతా.. బెండు తీస్తా... మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా నీ వెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంటా నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా జణక్కు జుమ్మా.... మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంటా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి