April 1st Vidudala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
April 1st Vidudala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, జులై 2021, శుక్రవారం

April 1 Vidudala : Chukkalu Themmenna Song Lyrics (చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా)

చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991)

సంగీతం :  ఇళయరాజా

సాహిత్యం :  సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: మనో, చిత్ర



చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా.. చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా.. నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా.. చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా.. షోలే ఉందా..ఇదిగో ఇంద... చాల్లే ఇది జ్వాలకాదా.. తెలుగులొ తీసారే బాలా.. ఖైదీ ఉందా.. ఇదిగో ఇంద.. ఖైదీకన్నయ్య కాదే.. వీడికి అన్నయ్య వాడే.. జగదేక వీరుడి కధ ఇది పాత పిక్చరు కద.. అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద.. ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి... చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా.. ఒకటా రెండా.. పదులా వందా.. బాకీ ఎగవేయకుండా.. బదులే తీర్చేది ఉందా.. మెదడే ఉందా.. మతిపోయిందా..చాల్లే మీ కాకి గోలా.. వెళాపాళంటూ లేదా... ఎమైంది భాగ్యం కధ.. కదిలిందాలేదా కధ.. వ్రతమేదో చేస్తుందట అందాక ఆగాలట.. లౌఖ్యంగా బ్రతకాలి.. సౌఖ్యాలే పొందాలి.. చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా.. నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా.. చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..

April 1 Vidudala : Maatante Maatenanta Song Lyrics (మాటంటే మాటేనంటా)

చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991)

సంగీతం :  ఇళయరాజా

సాహిత్యం :  వెన్నెలకంటి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా... నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంట గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా ఎవరంటే నాకేమంటా తప్పులుంటె ఒప్పనంట నీ వెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంటా నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా జణక్కు జుమ్మ... మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంతా అంటా మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంట చరణం 1: నువ్వే మా మొదటి గెస్టని.. మా ఆవిడ వంట బెస్టని ఈ ఫీస్టుకి పిలుచుకొస్తినీ... టేస్టు చెప్పి పోరా ఇదే మా విందుభోజనం మీరే మా బంధువీదినం రుచుల్లో మంచి చెడ్డలూ ఎంచి తెలుపుతారా.. అపార్ధం చేసుకోరుగా... అనర్ధం చెయ్యబోరుగా యదార్ధం చేదుగుంటది... పదార్ధం చెత్తగున్నదీ ఇది విందా నా బొందా... తిన్నోళ్ళూ గోవిందా జంకేది లేదింక నీ టెంక పీకెయ్యగా.. పదర కుంకా.. నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంటా గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా ఎవరంటే నాకేమంటా తప్పులుంటె ఒప్పనంట నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా చరణం 2 : భళారే నీలి చిత్రమా భలేగా... ఉంది మిత్రమా ఇలా రసయాత్ర సాగదా.. పక్కనుంటె భామా కోరావూ అసలు ట్రూతును... చూపాను సిసలు బూతును చిక్కారూ తప్పుచేసి ఇక మక్కెలిరగదన్నూ తమాషా చూడబోతిరా... తడాఖా చూపమందురా మగాళ్ళని ఎగిరిపడితిరా... మదించీ మొదలు చెడితిరా సిగ్గైనా ఎగ్గైనా లేకుండా దొరికారా ... లాకప్పు పైకప్పు మీకిప్పుడే చూపుతా.. బెండు తీస్తా... మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా నీ వెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంటా నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా జణక్కు జుమ్మా.... మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంటా

30, మే 2021, ఆదివారం

April 1st Vidudala: Ompula Vykari Song Lyrics (ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి)

చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991)

సంగీతం :  ఇళయరాజా

సాహిత్యం :  సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



Male:  ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి Female: వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి Male:  మోవిని మగతావిని ముడివేయనీయవా Female: కాదని అనలేనని గడి అయిన ఆగవా Male: అదుపు పొదుపులేని ఆనందం కావాలి Female: హద్దు పొద్దు లేని ఆరాటం ఆపాలి Male: ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి Female: వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి Male:కాంక్షలో కైపునిప్పు ఎంతగా కాల్చినా దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా Female: శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా                 వాంచతో వేగు దేహం పరయాగవాటిక Male:కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా Female: మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా

Male:ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి Female:వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి Male: నిష్ఠగా నిన్నుకోరి నియమమే దాటినా కష్టమే సేదతీరే నేస్తమే నోచనా Female:  నిగ్రహం నీరుగారే జ్వాలలోడించినా                 నేర్పుగా ఈది చేరే నిశ్చయం మెచ్చనా Male: సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా Female: మదనమే అంతమయ్యే అమృతం అందుకో

Male: ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి Female: వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి Male: మోవిని మగతావిని ముడివేయనీయవా Female: కాదని అనలేనని గడి అయిన ఆగవా Male: అదుపు పొదుపులేని ఆనందం కావాలి Female: హద్దు పొద్దు లేని ఆరాటం ఆపాలి Male: ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి Female:వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి