16, జులై 2021, శుక్రవారం

Awaara : Mandaara Poovalle Song Lyrics(పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా)

చిత్రం:ఆవారా(2012)

సంగీతం: యువన్ శంకర్ రాజా

సాహిత్యం: భువన చంద్ర

గానం: బెన్నీ దయాల్



వచ్చిందిరా

పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా

వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా

నా గుండెల్లో వీచే సుమ గంధాల గాలి

తన కళ్ళల్లో పేర్చే పసి పరువాల డోలి

యదలో ఎంతున్నా ఒక మాటే రాదే

నా కళ్ళల్లోన అరె కలలే రావే

పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా


వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా


మదిలో మౌనం రగిలే వేళ కొంచెం మోహం దాహం చుట్టివేసెనే

తొలిచూపే విరి తూర్పై యద తలుపుని మెరుపల్లె తట్టివేసెనే

అద్దాన్ని సరిచేసి మనసంతా కళ్ళల్లో పొదిగానే పొదిగానే

పిల్లా నే నీ ముద్దు మురిపాల వలపుల్లో తడిసానే తడిసానే

పురి విప్పే మేఘాన్నై ఒడిలో తారగ నిను తలిచా

వేసవిలో వెల్లువనై బుగ్గలు తాకి యద మరిచా


పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా

వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా


అలలాగా కుదిపేసే తన పేరుని వింటే పరిమళమే

కలలోనే కనిపించే తన నగవులు కంటే పరవశమే

ఏనాటి ఊసుల్నో ఏనాటి బాసల్నో వింటున్నా వింటున్నా

ఆగంటు నిలదీసే రహదారి దీపాన్నై నిలుచున్నా వెలిగున్నా

మది తొలిచే పాటలకి అర్ధాలే నీవని మురిసితినే

ఒక నదిలా నీవొస్తే బాగా దూరం తరిగెనులే

నా గుండెల్లో వీచే సుమ గంధాల గాలి

తన కళ్ళల్లో పేర్చే పసి పరువాల డోలి

యదలో ఎంతున్నా ఒక మాటే రాదే

నా కళ్ళల్లోన అరె కలలే రావే

పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా

వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి