చిత్రం : ఆవారా (2012)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం: యస్.పి.చరణ్
ఏదో అలజడి నను పిలిచే.. కళ్లే దాటి కలలే నడిచే.. చుట్టూ అంతా నాటకమైతే.. నటన రాక నే వెళ్ళిపోతే.. కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగి పోయనా… పోదే పొడిచి నింగే విడిచి వెన్నెల వెళ్ళిపోవునా… పిల్ల నీ తలపులతో.. ఎదకి ప్రాణం పోసానే.. నీకే దూరం అవుతున్నా… ఎదని వదిలి వెళుతున్నా… నన్నే నువ్వుగా మార్చా నేనిక ఏమి కాక మిగిలానిల ఎటూ వెళ్ళక ఏమి తోచక ఉన్న వేచి నువ్వు లేక ఎల నీ రాక జీవితంలో నా పగలు రేయిని మరిపించిందిలే నువ్వు వెంట లేకపోతే నా చావుకు బతుకుకు తేడా లేదులే మంటే రేపు తడి జ్వాలముఖి కన్నీల్లారవే ఓ చెలియా నువ్వే జ్ఞాపకం అయ్యావు ఈ క్షణం అంతేనా ఓ… పిల్ల నీ తలపులతో.. ఎదకి ప్రాణం పోసానే.. నీకే దూరం అవుతున్నా… ఎదని వదిలి వెళుతున్నా… ఏదో అలజడి నను పిలిచే కళ్లే దాటి కలలే నడిచే చుట్టూ అంతా నాటకమైతే నటన రాక నే వెళ్ళిపోతే కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగి పోయనా… పోదే పొడిచి నింగే విడిచి వెన్నెల వెళ్ళిపోవునా… పిల్ల నీ తలపులతో.. ఎదకి ప్రాణం పోసానే.. నీకే దూరం అవుతున్నా… ఎదని వదిలి వెళుతున్నా… ఓఓ.. ఓఓఓ… ఓఓ.. ఓఓఓ…