చిత్రం:చెప్పవే చిరుగాలి(2004)
సంగీతం: S.A.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం: వందేమాతం శ్రీనివాస్
నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలనీ... నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్నీ... నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలనీ... నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్నీ... కన్నయ్యా అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది అన్నయ్యా అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది ఈ ఆడాళ్ళు హింసావాదులూ... మన మగ వాళ్ళు ఆశావాదులూ... నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలనీ... నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్నీ... ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా ఆడదాని వల్ల సన్యాసులయిన పురుషులెంతమందో మన పురుష జాతి వల్ల కాషాయం కట్టిన ఒక్క ఆడదుందా. ఆడదానికై మగాడొకడు తాజ్ మహల్ కట్టగా మగవాడి కోసమై ఏ ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా మగవాళ్ళు మంచి మనుషులూ... మరి ఆడాళ్ళు ముంచే మనుషులూ... నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలనీ... నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్నీ పరీక్షల్లో ఎపుడూ ఆడవాళ్ళదె ఫస్ట్ ప్లేసు... మన కుర్రాళ్ళని అసలు చదవనిస్తే కదా బాసు ఆటపాటల్లో ఆడాళ్ళకే అన్ని బహుమతులు వాళ్ళ ఆటలొ పడ్డ కుర్రాళ్ళకే లేవు పుట్టగతులు ఆడవాళ్ళ అందాలకే స్వర్ణ కిరీటాలు వాళ్ళ వాత పడ్డ మగాళ్ళకే మాసిన గడ్డాలు ఆడాళ్ళు మహా ముదురులూ... మన మగవాళ్ళు మావి చిగురులూ... నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలనీ... నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్నీ... కన్నయ్యా అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది అన్నయ్యా అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది ఈ ఆడాళ్ళు హింసావాదులూ... మన మగ వాళ్ళు ఆశావాదులూ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి