Cheppave Chirugali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Cheppave Chirugali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, మార్చి 2024, శుక్రవారం

Cheppave Chirugali : Andaala Devatha Song Lyrics (అందాల దేవతా ఆరాద్య దేవత)

చిత్రం: చెప్పవే చిరుగాలి (2004)

రచన: శివ గణేష్

గానం: హరిహరన్,  కె.యస్.చిత్ర

సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్



అందాల దేవతా ఆరాద్య దేవత అందాల దేవతా ఆరాద్య దేవత శతకోటి పూలు ఉన్నాయి గానీ చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా అందాల దేవతా ఆరాద్య దేవత అందాల దేవతా ఆరాద్య దేవత తెలి మంచు సైతం నిను తాకితే చలి తాళలేక మేను వణకదా పూబాల సైతం నిను చేరితే పూవంటు నిన్నే సిగలు ముడవదా అమృతమున్న చోట ఆయువుంటదంట నీ అందమందుకుంటే అమృతమెందుకంట నీ పెదవి ఒంపు పదవి చాలు భువి నేను గెలవనా అందాల దేవతా ఆరాద్య దేవత అందాల దేవతా ఆరాద్య దేవత సుడిగాలి అననా నీ చూపునీ నేనందులోన చిక్కినాననీ సిరివెన్నెలననా నీ నవ్వునీ యెదలోన నింపి వెలిగినానని పసిడి మువ్వలల్లీ కాలిగొలుసు కడత రెండు మువ్వలూడి పడితే కంటిపాపలెడత నిను ద్వీపమల్లే కాపుకాచి కడలల్లే మారుతా అందాల దేవతా ఆరాద్య దేవత అందాల దేవతా ఆరాద్య దేవత శతకోటి పూలు ఉన్నాయి గానీ చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా అందాల దేవతా ఆరాద్య దేవత అందాల దేవతా ఆరాద్య దేవత

11, డిసెంబర్ 2023, సోమవారం

Cheppave Chirugali : Happy New Year Song Lyrics (హ్యాపీ న్యూ ఇయర్)

చిత్రం: చెప్పవే చిరుగాలి (2004)

రచన: శివ గణేష్

గానం: హరిహరన్,  కె.యస్.చిత్ర

సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్



హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా... హర్టి వెల్కమ్ చెప్పేదమ హాయిగా... కొత్త కొత్త ఊహల్లో తెలిపో డియర్... మనసులోని ఆశలని పంచుకో బ్రదర్... గుండెలోని భావాలు గుప్పు మన్న ఈ వేళ కదిళ్ళల్లే కాలపు కన్నేకు టా... టా. చేపుదమ. జనవరితో ఆడుగులు వేస్తూ ముందుకు పోదామా... (ఆడవారి గొంతు). హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా. హర్టి వెల్కమ్ చెప్పేదమ హాయిగా ...

సంగీతం తొలి తొలి చూపుతో రవికుల సోముని వలచిన జాణకి మురిశినది... కన్నుల వెన్నెల కురిసినది...


అదేం మొహమో... అదేం దాహమో... కలయికలోని మధుర్యమో... ఇదేం సౌక్యమో. ఇదేం సర్గమో. మనసును దోచే సౌందర్యమే. అవుననే అన్నది అంది అలగవలి. మోజులే తిరాని మౌనమే వదలి... నీ శ్వాసల ఉయాలలో నేను ఉయాలలుగలి... నీ అందం కన్నులవిందై చిందులు వేయాలి.

అలల అలల వచ్చేసింది యువన్నమ్. నువ్వు నేను కలిసే క్షణమే శాశ్వతం...

కలతనిదురాలో... కలాలనిడలో నా పెదవులపై నీ నామమే... పూలరుతువులో తేనె చినుకుల్లో కనిపించేది నీ రూపమే. కోరికే తారకై చెరారమ్మంటే. చేరువై ఆకలే తీర్చుకోమంటే... కనురెప్పల పల్లకిలో నిన్ను ఎత్తుకుపోతానే... చిరుగాలుల సవ్వడిలో నిన్ను అల్లుకుపోతలే... హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా... హర్టి వెల్కమ్ చెప్పేదమ హాయిగా... కొత్త కొత్త ఊహల్లో తెలిపో డియర్... మనసులోని ఆశలని పంచుకో బ్రదర్... గుండెలోని భావాలు గుప్పు మన్న ఈ వేళ కదిళ్ళల్లే కాలపు కన్నేకు టా. టా... చేపుదమ. జనవరితో ఆడుగులు వేస్తూ ముందుకు పోదామా. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా... హర్టి వెల్కమ్ చెప్పేదమ హాయిగా...

30, అక్టోబర్ 2022, ఆదివారం

Cheppave Chirugali : Nannu Lalinchu Song Lyrics (నన్ను లాలించు )

చిత్రం : చెప్పవే చిరుగాలి (2004)

సంగీతం : S.A .రాజ్ కుమార్

సాహిత్యం : శివ గణేష్

గానం: సుజాత



నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నువ్వు చిరుగాలివా లేక విరివానవా మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేకా నేనే నువ్వా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నదిలాగ నీవు కదలాడుతుంటే నీతోపాటూ సాగేతీరం నేనవ్వనా నిశిరాత్రి నీవు నెలవంక నేను నీతోపాటూ నిలిచే కాలం చాలందునా మొగ్గై ఎదురొచ్చీ వనముగ మారావూ కలలే నాకిచ్చీ కనులను దోచావూ ఎదలయలోన లయమయ్యే శృతివే నువ్వు నా బ్రతుకే నువ్వూ నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా భువిలోన గాలి కరువైన వేళా నా ప్రాణాన్ని నీ ఊపిరిగా మార్చేయనా నీలాల నింగీ తెలవారకుంటే నా జీవాన్నీ నీకూ దివ్వెగ అందించనా శిలలా మౌనంగా కదలక పడి ఉన్నా అలలా నువు రాగా అలజడి అవుతున్నా దీపం నువ్వైతె నీ వెలుగు నేనవ్వనా నీలో సగమవ్వనా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నువ్వు చిరుగాలివా లేక విరివానవా మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేక నేనే నువ్వా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా 

నిన్ను పాలించు సంతోషం నేనే కదా 

15, జులై 2021, గురువారం

Cheppave Chirugali : Nammaku Nammaku Aadalloloni Premani Song Lyrics (నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలనీ.)

చిత్రం:చెప్పవే చిరుగాలి(2004)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: చంద్రబోస్

గానం: వందేమాతం శ్రీనివాస్



నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలనీ... నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్నీ... నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలనీ... నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్నీ... కన్నయ్యా అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది అన్నయ్యా అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది ఈ ఆడాళ్ళు హింసావాదులూ... మన మగ వాళ్ళు ఆశావాదులూ... నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలనీ... నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్నీ... ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో  మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా ఆడదాని వల్ల సన్యాసులయిన పురుషులెంతమందో  మన పురుష జాతి వల్ల కాషాయం కట్టిన ఒక్క ఆడదుందా. ఆడదానికై మగాడొకడు తాజ్ మహల్ కట్టగా  మగవాడి కోసమై ఏ ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా మగవాళ్ళు మంచి మనుషులూ... మరి ఆడాళ్ళు ముంచే మనుషులూ... నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలనీ... నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్నీ పరీక్షల్లో ఎపుడూ ఆడవాళ్ళదె ఫస్ట్ ప్లేసు... మన కుర్రాళ్ళని అసలు చదవనిస్తే కదా బాసు ఆటపాటల్లో ఆడాళ్ళకే అన్ని బహుమతులు వాళ్ళ ఆటలొ పడ్డ కుర్రాళ్ళకే లేవు పుట్టగతులు ఆడవాళ్ళ అందాలకే స్వర్ణ కిరీటాలు వాళ్ళ వాత పడ్డ మగాళ్ళకే మాసిన గడ్డాలు ఆడాళ్ళు మహా ముదురులూ... మన మగవాళ్ళు  మావి చిగురులూ... నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలనీ... నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్నీ... కన్నయ్యా అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది  అన్నయ్యా అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది ఈ ఆడాళ్ళు హింసావాదులూ... మన మగ వాళ్ళు ఆశావాదులూ...