చిత్రం: ఈశ్వర్ (2002)
సంగీతం: ఆర్.పీ.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: రాజేష్ ,ఉష
పల్లవి :
ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా
నీ నీడై నిలిచి ఉన్నాననీ
ఇన్నాళ్లు చెంతనున్నా ఈనాడే చెప్పుకున్నా
నీ కోసం బతికి ఉన్నాననీ
కొలువుండిపో ప్రాణమై ఇలా
ఎద నిండిపో అనురాగమా
ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా
నీ నీడై నిలిచి ఉన్నాననీ
ఇన్నాళ్లు చెంతనున్నా ఈనాడే చెప్పుకున్నా
నీ కోసం బతికి ఉన్నాననీ
చరణం : 1
స్వప్నమో సత్యమో తెలుసుకోవద్దనీ
చూపుతో చెప్పనీ రెప్ప వేయొద్దనీ
ఎప్పుడూ నిన్నిలా చూస్తుంటే చాల్లే అనీ
మబ్బుల్లో జాబిల్లినీ గుప్పిట్లో పొందాలని
నమ్మాలి అనిపించని ఊహల్లో నన్నుండనీ
ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా
నీ నీడై నిలిచి ఉన్నాననీ
చరణం : 2
నేననే మాటనే మరిచిపోయాననీ
నిన్నిలా అల్లుతూ కొత్తగా పుట్టనీ
ఇప్పుడీ జన్మకి నీ పేరు పెట్టనీ
నిట్టూర్పులన్నింటినీ నిన్నల్లో వదిలెయ్యనీ
రానున్న వెయ్యేళ్లనీ ఈ పూట ఉదయించనీ
ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా
నీ నీడై నిలిచి ఉన్నాననీ
ఇన్నాళ్లు చెంతనున్నా ఈనాడే చెప్పుకున్నా
నీ కోసం బతికి ఉన్నాననీ
కొలువుండిపో ప్రాణమై ఇలా
ఎద నిండిపో అనురాగమా
ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా
నీ నీడై నిలిచి ఉన్నాననీ
ఇన్నాళ్లు చెంతనున్నా ఈనాడే చెప్పుకున్నా
నీ కోసం బతికి ఉన్నాననీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి