6, జులై 2021, మంగళవారం

Manasantha Nuvve : Cheppave Prema Song Lyrics (చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా)

చిత్రం : మనసంతా నువ్వే

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: S.P.చరణ్, సుజాత


చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా

మనసంతా నువ్వే మనసంతా నువ్వే

మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే

హే హే హే...హే హే హే...హే హే హే హే...


వయసుకే తెలియదే ఇన్నాళ్ళు గడిచిందని

పరికిణీ బొమ్మకి పైట చుడుతుందని

దూరమే చెప్పదే నీ రూపు మారిందని

స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దైందని

ఇకపై మన కౌగిళింతకి చలి చీకటి కంటపడదని

ఎపుడూ మన జంట గడపకి కలతన్నది చేరుకోదని

కొత్తగా తెలుసుకున్నాననీ...


చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా


రెక్కలే అలిసినా నీ గుండెలో వాలగా

ఎక్కడా ఆగక ఎగిరి వచ్చానుగా

పక్కనే ఉండగా కన్నెత్తి నను చూడక

దిక్కులే వెదుకుతూ వెతికావులే వింతగా

ప్రాణానికి రూపముందని అది నువ్వై ఎదురయ్యిందని

ప్రణయానికి చూపు ఉందని హృదయాన్నది నడుపుతుందని

విరహమే తెలుసుకోవాలని...


చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా

మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా

మనసంతా నువ్వే మనసంతా నువ్వే

మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే

హే హే హే...హే హే హే...హే హే హే హే...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి