Eswar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Eswar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, నవంబర్ 2021, గురువారం

Eeswar : Ammerpet ki Dhool Peta ki (అమీర్ పేటకి దూల్ పేట కి షహర్ ఒకటేరా)

చిత్రం: ఈశ్వర్ (2002)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఆర్.పీ.పట్నాయక్

సంగీతం: ఆర్.పీ.పట్నాయక్



(పల్లవి):-

దుమ్ దుమ్ దుమ్ దుమ్ దుమ్ దుమ్ దుంద దదం డమ్ డమడమ్ డోల్ బాజా షోరు మచ్చా చమ్ చమచమ్ చైర చిచ్చా మస్తు మజా... అమీర్ పేటకి దూల్ పేట కి షహర్ ఒకటేరా... కార్లకైనా కాల్లకైనా సడకొకటేరా... ఎవడికళల కోటకి మహరాజు వాడేరా... ఎగిరిపడే నవాబ్ గిరి చెల్లదు పోరా... అరె చల్ బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతవ్ భాయ్... మరి పోచేస్తే మా దమ్ముతో. మీ దుమ్ముని దులిపితే దిక్కెవడోయ్.... డమ్ డమడమ్ డోల్ బాజా షోరు మచ్చా... చమ్ చమచామ్ చైర చిచ్చా మస్తు మజా... అమీర్ పేటకి దూల్ పేటకి షహర్ ఒకటేరా... కార్లకైనా కాల్లకైనా సడకొకటేరా.... (చరణం.1):-

దేవుడైనా మనలా ధీమాగా తిరగ గలడా... కోవెలొదిలి వీధిలో పడి... చిరంజీవి ఐనా సినిమాలు చూడగలడా మొదటి ఆట Queue లో నిలబడి... బోనాల్ జాతరలో చిందులేయ్యగలరా.. హోలీ రంగులతో తడిసి నవ్వగలరా.గొప్ప గొప్ప వాలెవరైనా .... దమ్ దమధమ్ డోల్ బాజా షోరు మచ్చా.. చమ్ చమచమ్ చైర చిచ్చా మస్తు మజా... అమీర్ పేటకి దూల్ పేటకి షహర్ ఒకటేరా... కార్లకైనా కాల్లకైనా సడకొకటేరా..... (చరణం.2):-

కొత్త వానలోని. ఈ మట్టి సువాసనని. ఏ అంగడి అమ్ముతుంది రా... పాత బస్తీలోని. ఈ పానిపూరీని రుచి చూడని జన్మెందుకు రా... సొమ్ము పిలవగలదా చల్లటి వెన్నెలని... ఎంత వాడు గాని. ఎంత ఉన్న గాని కొనగలడా అమ్మ ప్రేమని.... డమ్ డమడమ్ డోల్ బాజా షోరు మచ్చా... చమ్ చమచమ్ చైర చిచ్చా మస్తు మజా... అమీర్ పేటకి దూల్ పేటకి షహర్ ఒకటేరా... కార్లకైనా కాల్లకైనా సడకొకటేరా... ఎవడి కళల కోటకి మహరాజు వాడేరా... ఎగిరి పడే నవాబ్ గిరి చెల్లదు పోరా... అరె చల్ బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావ్ భాయ్... మరి పోచేస్తే మా దమ్ముతో .మీ దుమ్ముని దులిపితే దిక్కెవడోయ్... అమీర్ పేటకి దూల్ పేటకి షహర్ ఒకటేరా... కార్లకైనా కాల్లకైనా సడకొకటేరా... ఎవడి కళల కోటకి మహరాజు వాడేరా... ఎగిరి పడే నవాబ్ గిరి చెల్లదు పోరా

6, జులై 2021, మంగళవారం

Eeswar : Innallu Chenthanuna Song Lyrics (ఇన్నాళ్లు చూడకున్నా)

చిత్రం : ఈశ్వర్ (2002)

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రాజేష్ ,ఉష


పల్లవి :

ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా

నీ నీడై నిలిచి ఉన్నాననీ

ఇన్నాళ్లు చెంతనున్నా ఈనాడే చెప్పుకున్నా

నీ కోసం బతికి ఉన్నాననీ

కొలువుండిపో ప్రాణమై ఇలా

ఎద నిండిపో అనురాగమా

ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా

నీ నీడై నిలిచి ఉన్నాననీ

ఇన్నాళ్లు చెంతనున్నా ఈనాడే చెప్పుకున్నా

నీ కోసం బతికి ఉన్నాననీ


చరణం : 1

స్వప్నమో సత్యమో తెలుసుకోవద్దనీ

చూపుతో చెప్పనీ రెప్ప వేయొద్దనీ

ఎప్పుడూ నిన్నిలా చూస్తుంటే చాల్లే అనీ

మబ్బుల్లో జాబిల్లినీ గుప్పిట్లో పొందాలని

నమ్మాలి అనిపించని ఊహల్లో నన్నుండనీ


ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా

నీ నీడై నిలిచి ఉన్నాననీ



చరణం : 2

నేననే మాటనే మరిచిపోయాననీ

నిన్నిలా అల్లుతూ కొత్తగా పుట్టనీ

ఇప్పుడీ జన్మకి నీ పేరు పెట్టనీ

నిట్టూర్పులన్నింటినీ నిన్నల్లో వదిలెయ్యనీ

రానున్న వెయ్యేళ్లనీ ఈ పూట ఉదయించనీ


ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా

నీ నీడై నిలిచి ఉన్నాననీ

ఇన్నాళ్లు చెంతనున్నా ఈనాడే చెప్పుకున్నా

నీ కోసం బతికి ఉన్నాననీ

కొలువుండిపో ప్రాణమై ఇలా

ఎద నిండిపో అనురాగమా

ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా

నీ నీడై నిలిచి ఉన్నాననీ

ఇన్నాళ్లు చెంతనున్నా ఈనాడే చెప్పుకున్నా

నీ కోసం బతికి ఉన్నాననీ