31, జులై 2021, శనివారం

Guduputani : Thanivi Theeraledhe Song Lyrics (తనివి తీరలేదే )

చిత్రం: గూడుపుఠాణి (1972 )

సంగీతం: ఎస్. పి. కోదండపాణి 

సాహిత్యం: 

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం,సుశీల



తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధామీ అనురాగం(2) చెలియా.....ఓ...చెలియా....ఓ.... ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలూగామే(2) ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడామే అందని అందాల అంచుకే చేరిననూ..(2) విరిసిన పరువాల లోతులే చూసిననూ(తనివి) తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధామీ అనురాగం ప్రియతమా...ఓ....ప్రియతమా..... ఎప్పుడు నీవే నాతో వుంటే ఎన్ని వసంతలైతేనేమి(2) కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నములు వస్తేనేమి వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ తియ్యని హృదయంలో తేనెలే కురిపించిననూ(తనివి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి