31, జులై 2021, శనివారం

Chitti Chellelu : Ee Reyi Thiyyanidi Song Lyrics

చిత్రం: చిట్టి చెల్లెలు (1970)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు


ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి

పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా చిన్నారి చెలియా అపరంజి కలువ చేరాలి కౌగిట జిలిబిలి నగవుల

ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి

పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా నిను చేరుకోగా నును మేని తీగ పులకించిపోయెను తొలకరి వలపుల

ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది

ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో

ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది నిను నన్ను కలిపే నీ నీడ నిలిపే అనురాగ సీమల అంచులు దొరికే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి