చిత్రం: తూర్పు పడమర (1976)
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
సంగీతం: రమేష్ నాయుడు
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృత వాహిని రాగల సిగలోన సిరిమల్లివీ సంగీత గగనాన జాబిల్లివీ స్వర సుర ఝారి తరంగానివీ స్వర సుర ఝారి తరంగానివీ సరస హృదయ వీణ వాహినీ శివరంజని నవరాగిణి ఆ కనులు పండు వెన్నల గనులు ఆ కురులు ఇంద్ర నీలాల వనులు ఆ వదనం అరుణోదయ కమలం ఆ అధరం సుమధుర మధు కలశం... శివరంజని నవరాగిణి జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి వేణుధరుని రథమారోహించిన విదుషిమణి రుక్మిణి రాశికృత నవరసమయ జీవన రాగాచంద్రికా లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా రావే..... రావే నా శివరంజని... మనోరంజని రంజని నా రంజని నీవే నీవే నాలో పలికే నాదానివీ నీవే నాదానివీ నా దానివి నీవే నాదానివీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి