2, జులై 2021, శుక్రవారం

Jayam : Evvaru Emanna Song Lyrics (ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ)

చిత్రం:జయం(2002)

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: కులశేఖర్

గానం: R.P.పట్నాయక్, ఉష


ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ

ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ

నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమ

మెత్తని మనసులు ఏరోజూ వీడదు ఈ ప్రేమ

కులమూ మతమూ లేవంటుంది మనసుకి ఈ ప్రేమ

నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ

ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ


*కాలమొస్తే సిరిమల్లెతీగకి చిగురే పుడుతుంది

ఈడువస్తే ఈ పడుచుగుండెలో ప్రేమే పుడుతుంది

గొడుగు అడ్డుపెట్టినంతనే వానజల్లు ఆగిపోవునా

గులకరాయి వేసినంతనే వరదజోరు ఆగిపోవునా

ఏడులోకాలు ఏకం ఐనా ప్రేమను ఆపేనా


ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ

ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ


*ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన చక్కని వరమంట

ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ అలుపే రాదంట

కండలెంత పెంచుకొచ్చినా కొండలైతే దించలేరుగా

కక్షతోటి కాలుదువ్వినా ప్రేమనెవ్వరాపలేరుగా

ప్రేమకెపుడైనా జయమేగానీ ఓటమి లేదంట


ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ

ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ

నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమ

మెత్తని మనసులు ఏరోజూ వీడదు ఈ ప్రేమ

కులమూ మతమూ లేవంటుంది మనసుకి ఈ ప్రేమ

నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ .. శాశ్వతం ఈ ప్రేమ..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి