చిత్రం:కొండపల్లి రాజా(1993) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
పల్లవి:
దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు
చాటు మాటు ఆటు పోటు
కోకమ్మ కట్టు దాటి పెట్టవే స్వీటు
హాటు ఘాటు నాటు నీటు
అందాల అర్ధరాత్రిలో అతికే ఉంటూ
గంధాల కౌగిలింతలో ఒదిగే ఉంటూ
చిరాకులే సరాగమై పరాకులారగించి
పైటంతా పక్కకు తీసి
దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు
చాటు మాటు ఆటు పోటు
కోకమ్మ కట్టు దాటి పెట్టవే స్వీటు
హాటు ఘాటు నాటు
చరణం:1
ఎడమ కుడి కన్నుల జంట అదిరింది
నీకు నాకు ఏక మంచ యోగముందని
ఆ పందిరి పట్టె మంచంలో తెలిసింది
వెన్ను వెన్ను ఆనిస్తే వెన్నలేనని
చిలిపి సొగసు చలికి రగిలే
పెదవి చివర ఎదలు పలికే
కూసినా తొలికోడి అనలేదు కొక్కొరో కొక్కో
కోరుకో ఒకసారి సరసాల చెమ్మల చెక్కో
సుఖీభవ సఖీప్రియ తపించి పోవు జంట
తాపాలే దీపాలెట్టి
దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు
చాటు మాటు ఆటు పోటు
కొకమ్మ కట్టు దాటి పెట్టవే స్వీటు
హాటు ఘాటు నాటు
చరణం:2
గణపవరం సిద్ధాంతి అన్నాడు
వలపుల్లో వర్జ్యాలే ఉండబోవని
గన్నవరం వేదాంతి చెప్పాడు
కౌగిలింత నోముల్లో కరిగిపొమ్మని
నలక నడుము మెలిక తిరిగే
తొడిమ తగిలి తొనలు అదిరే
చచ్చినా చలిగాలి మరి రాదు వెన్నెల కొడకో
వచ్చినా వడగాలై మరిగేను మల్లెల మొలకో
కదా ఖుషి కమామిషి కామాను అన్న వేళ
కౌగిట్లో చప్పట్లేసి
దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు
చాటు మాటు ఆటు పోటు
కొకమ్మ కట్టు దాటి పెట్టవే స్వీటు
హాటు ఘాటు నాటు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి