11, జులై 2021, ఆదివారం

Manmadhudu : Nenu Nenuga Lene Song Lyrics (నేను నేనుగా లేనే )

చిత్రం: మన్మధుడు(2002  )

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: S.P.చరణ్


నేను నేనుగా లేనే నిన్న మొన్నలా 

లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా 

ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా 

ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా 



పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు 

అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు 

తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు 

ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు 

నా మనసుని మైమరపున ముంచిన ఈ వాన 

మీకెవరికి కనిపించదు ఏమైనా 



చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా 

అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే 

తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా 

చెప్పలేని నిజమేదో నాకూ వింతే 

కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో 

చెప్పవ కనురెప్పలకే మాటొస్తే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి