చిత్రం: ఒకే ఒక్కడు(1999 )
సంగీతం: A.R.రెహమాన్
సాహిత్యం: A.ఎం.రత్నం, శివ గణేష్
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, హరిణి
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోశావే అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే కొడవలితో కసిగా మనసే కోశావే గడ్డి మొక్కకు కోత తెలియునా బాలకొమరినే కానా నీటి కొంగను చేప మింగునా జరుగునా బైట పూసినా లోన కాసెడి శనగ తోటను మామా మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా చిలకా రామ చిలకా మొలకా ప్రేమ మొలకా అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే కొడవలితో కసిగా మనసే కోశావే సూర్యున్ని రెండు చేసి కళ్ళలోన దాచుకుందో అహ...ఓ చందురున్ని కంటిపాపలోన తాను ఉంచుకుందో ఓ... రాతిరిని పట్టుకొచ్చి కాటుకల్లె పెట్టెదనా అహ...ఓ మిణుగురులు అంటించి బుగ్గలకు నిగ్గు తేనా ఓ... పొగడి నను రెచ్చగొట్టి నిద్ర చెడగొట్టకయ్యా తలగడగా నాకొక్క పంచె నువ్వీయవయా కనులా కునుకే కలయా చిలకా రామ చిలకా మొలకా ప్రేమ మొలకా అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోశావే కొండపల్లి బొమ్మతోటి జంటచేరి ఆడకుండా కొండపల్లి బొమ్మతోటి జంటచేరి ఆడకుండా తేనెపట్టు పట్టుపట్టి పాడు చేయ శపథమా అహ...ఓ ప్రేమంటే పార్టీ విడిచీ పార్టీ మార్చు విషయమా ఓ... కన్నెపిల్ల సైగ చేస్తే తలక్రిందులౌదువా అహ...ఓ నే నడుచు నీడలోన నీవుండ సమ్మతమా నేగనక నీరైతే నీ నుదుటపై నే జారి అందాల నీ ఎదపై హుందాగ కొలువుంటా కానీ అన్నీ కలలే చిలకా రామ చిలకా మొలకా ప్రేమ మొలకా అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే మిఠాయి మాటలతో తుటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే కోశావే గడ్డి మొక్కకు కోత తెలియునా బాలకొమరినే కానా నీటి కొంగను చేప మింగునా జరుగునా బైట పూసినా లోన కాసెడి శనగ తోటను మామా మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి