31, జులై 2021, శనివారం

Prema Sagaram : Andalolike Sundari Song Lyrics (ఏలేలమ్మ ఏలేలమ్మ )


చిత్రం : ప్రేమ సాగరం (1983) సంగీతం: టీ రాజేందర్ నేపధ్య గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, శైలజ



ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హోయ్.. ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హోయ్... అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ.. పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను... అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను.. పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను... రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి.. నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి... అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ.. పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేనూ... గాలుల గారాలే చెలి కులుకున నిలిపినది మెరుపుల మిసమిసలే మేఘాలకు తెలిపినది ముద్దు మోములో కొటి మోహములు చిలికేను నా చెలి కనులే సింధు భైరవిని చిలక పలుకుల దోర పెదవులే పలికే... ప్రేమ యువకుల పాలిట ఒక వరం అది వలచిన మనసుల అభినయం ప్రేమ యువకుల పాలిట ఒక వరం అది వలచిన మనసుల అభినయం లాలాలల లాలాలల లాలాలల లాలాలల అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ.. పున్నమి వెన్నెల వన్నెలు చిలికే మనసే ఇచ్చేనూ... అప్సరా ఆడెనే.. అందెలే మ్రోగెనే... మరులు విరిసి పలకరించె మనసు కలలు మురిసి పులకరించె వయసు కన్నులు కులికెను కవితలు పలికెను పాదము కదిలెను భావము తెలిసెను అదే కదా అనుక్షణం చెరగని సల్లాపమే ఉల్లాసమే ఆ నగవూ.. మోహము కొనసాగే తొలి మోజులు చెలరేగే నా పాటకు పల్లవిలా చెలి పొంగెను వెల్లువలా అమరవాణి ఇది అందాల గని ఇది నవతరానికే ఆధారం మధుర మధుర సుకుమార ప్రణయ రసలోక తరంగిణి  చెలి స్నేహం ... ఆ... పలవరింతలు రేపెను కోటీ.. ఆమె కెవరు లేరిక సాటీ... పలవరింతలు రేపెను కోటి.. ఆమె కెవరు లేరిక సాటి... లాలాలల లాలాలల లాలాలల లాలాలల అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను పున్నమి వెన్నెల వన్నెలు చిలికే మనసే ఇచ్చేను ఆ...రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ.. పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేనూ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి