చిత్రం: వయసు పిలిచింది(1978 )
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఇళయ రాజా
పల్లవి :
హే..! ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా
అరె..! ముట్టుకుంటే ముడుసుకుంటావ్… ఇంత సిగ్గా… ఆఆ ఆ
మబ్బే మసకేసిందిలే… పొగమంచే తెరగా నిలిసిందిలే
ఊరు నిదరోయిందిలే… మంచిసోటే మనకు కుదిరిందిలే
మబ్బే మసకేసిందిలే… పొగమంచే తెరగా నిలిసిందిలే
చరణం 1 :
కురిసే సన్నని వాన… సలి సలిగా ఉన్నది లోన
కురిసే సన్నని వాన… మది సలి సలిగా ఉన్నది లోన
గుబులౌతుందిలే గుండెల్లోనా…
జరగనా కొంచెం… నేనడగనా లంచం
చలికి తలలు వంచం… నీ ఒళ్ళే పూల మంచం
వెచ్చగా ఉందామూ… మనమూ
హే..! పైటలాగా నన్ను నువ్వు కప్పుకోవే
గుండెలోనా గువ్వలాగా ఉండిపోవే… హే ఏ ఏ
మబ్బే మసకేసిందిలే… పొగమంచే తెరగా నిలిసిందిలే
చరణం 2:
పండే పచ్చని నేలా… అది బీడైపోతే మేలా
పండే పచ్చని నేలా… అది బీడైపోతే మేలా
వలపు కురిస్తే… వయసు తడిస్తే
పులకరించు నేల… అది తొలకరించు వేళ
తెలుసుకో పిల్లా… ఈ బిడియమేలా మళ్ళ
ఉరికే పరువమిదీ… మనదీ
హే..! కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా
దాపుకొస్తే కోర్కెలన్నీ తీరిపోవా…
మబ్బే మసకేసిందిలే… పొగమంచే తెరగా నిలిసిందిలే
చరణం 3:
నవ్వని పువ్వే నువ్వు… నునువెచ్చని తేనలు ఇవ్వు నవ్వని పువ్వే నువ్వు… నునువెచ్చని తేనలు ఇవ్వు దాగదు మనసే… ఆగదు వయసే ఎరగదే పొద్దు… అది దాటుతుంది హద్దు ఈయవా ముద్దు… ఇక ఆగనే వద్దు ఇద్దరమొకటవనీ… కానీ హే..! బుగ్గ మీద మొగ్గలన్నీ దూసుకోనీ రాతిరంతా జాగారమే చేసుకోనీ… ఈ ఈఈ మబ్బే మసకేసిందిలే … పొగ మంచే తెరగా నిలిసిందిలే ఊరు నిదరోయిందిలే… మంచిసోటే మనకు కుదిరిందిలే సోటే కుదిరిందిలే… మంచిసోటే మనకు కుదిరిందిలే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి