31, జులై 2021, శనివారం

Prema Sagaram : Chakkanaina O Chirugaali Song Lyrics (చక్కనైన ఓ చిరుగాలి )

చిత్రం : ప్రేమ సాగరం (1983)

సంగీతం: టీ రాజేందర్

గీతరచయిత : రాజశ్రీ

నేపధ్య గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం


పల్లవి:

చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి..
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి...
ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి..
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి...
ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం చరణం 1:

మూశారు గుడిలోని తలుపులను.. ఆపారు గుండెల్లొ పూజలను... దారిలేదు చూడాలంటే దేవతను.. వీలుకాదు చెప్పాలంటే వేదనను... కలతైపోయె నాహృదయం.. కరువైపోయె ఆనందం... అనురాగమీవేళ ఐపోయె చెరసాల. అనురాగమీవేళ ఐపోయె చెరసాల.. ఐపోయె చెరసాల... గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం

చరణం 2:

నాప్రేమ రాగాలు కలలాయె.. కన్నీటి కధలన్ని బరువాయె... మబ్బు వెనక చందమామ దాగివున్నదో.. మనసు వెనక ఆశలన్ని దాచుకున్నదో... వేదనలేల ఈ సమయం.. వెలుతురు నీదే రేపుదయం... శోధనలు ఆగేను శోకములు తీరేను. శోధనలు ఆగేను శోకములు తీరేను.. శోకములు తీరేను... గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి.. చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి... ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం.
ఈ నా ప్రేమ సందేశం.. ఈ నా ప్రేమ సందేశం...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి