16, జులై 2021, శుక్రవారం

Simhadri : Ammaina Nana Aina Song Lyrics ( అమ్మైనా నాన్నైనా )

చిత్రం:సింహాద్రి(2003)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కళ్యాణి మాలిక్


గిరినీమె గలగాల గిరితీతి బైమారె బియ్యాన దెకదెకో జురతీతి బైమా అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా..... చాల్లే అని ఎవరైనా ఆపుంటే ఎపుడైనా సయ్యాట సాగేనా... ఎగసే కెరటాన... అమ్మానాన్నా ఉంటే ... అమ్మో మా ఇబ్బందే.... కాస్తయినా అల్లరి చేసే వీల్లేదే  అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా..... సూరీడుకి నాన్నుంటే స్కూల్లో పెడతానంటే పగలైనా వెలుతురు వస్తుందా.. జాబిల్లికి అమ్ముంటే ఒళ్ళో జోకొడుతుంటే రాతిరేళ వెన్నెల కాస్తుందా... నిను చేరేనా... నా లాలనా... ఏనాటికైనా ఓ పసికూనా... ఆడిందే ఆటంట ... పాడిందే పాటంట ఆపేందుకు అమ్మానాన్నా లేరంట.. సరదాగా రోజంతా తిరగేనా ఊరంతా ఊరేగే చిరుగాలికి ఉండుంటే అమ్మా అలుపంటూ లేకుండా చెలరేగి ఉరికేనా... ఉప్పొంగే సెలయేటికి ఉండుంటే నాన్న... అలిగిందా రా చిలకా ....కూచుందా కిమ్మనక... నాతో మాటాడేదెవరింకా రానందా నావంక ... దాగుందా కొమ్మెనకా... అమ్మో మరి నాకేం దారింకా... ఏది ఏది రానీ రానీ నన్నేరుకోనీ ముత్యాలన్నీ నీ నవ్వే చాలంటా పులకించే నేలంతా పున్నాగ పువ్వులతొటయ్యేనంట... గిరినీమె గలగాల గిరి తీతి బైమారె బియ్యాన దెకదేకో జరతీతి బైమా జగలోన సుగుణాల పలుమారు సుడాలే సరిపోలు జడివాన ఒదిగే ఈగాలి దిక్కుల్నే దాటాలి చుక్కల్నే తాకాలి... ఆనందం అంచుల నేడే చూడాలి... గిరినీమె గలగాల గిరి తీతి బైమారె బియ్యాన దెకదేకో జరతీతి బైమా జగలోన సుగుణాల పలుమారు సుడాలే సరిపోలు జడివాన ఒదిగే ఈగాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి