Simhadri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Simhadri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జులై 2021, శనివారం

Simhadri : Chinnadamme Cheekulu Song Lyrics (చిన్నదమ్మే చీకులు కావాలా)

చిత్రం: సింహాద్రి (2003)

సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి

సాహిత్యం: వెన్నెలకంటి

గానం: మనో, శ్రేయ ఘోషల్


చిన్నదమ్మే చీకులు కావాలా నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా హే చిన్నదమ్మే చీకులు కావాలా నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా గుమ్మలూరి పిల్ల నా సమ్మలోరికిల్లా చెక్కేస్తే ఎల్లా చేస్తాను ఒళ్ళు గుల్లా చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలీ హే చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలీ

చరణం: 1

ఆకులు కావాలా పోకలు కావాలా సోకులు కావాలా పూతరేకులు కావాలా ఆకులు పోకలు పోకలు సోకులు అన్నీ కావాలా జున్నే కావాలా అన్నీ కావాలా లేత జున్నేకావాలా లస్కు టపా లబ్జులు కావాలా దానిమ్మలిచ్చే ఉస్కులపా ఊపులు కావాలా హే లస్కు టపా లబ్జులు కావాలా దానిమ్మలిచ్చే ఉస్కులపా ఊపులు కావాలా శింగరాయ కొండ నా చికాకోలు దండ విస్తా కలకండ కాయిస్తా చలి ఎండ లస్కు టపా లబ్జులు కావాలి ఈ గుమ్మతెచ్చే ఉస్కులపా ఊపులు కావాలి హే లస్కు టపా లబ్జులు కావాలి ఈ గుమ్మతెచ్చే ఉస్కులపా ఊపులు కావాలి

చరణం: 2

షాకులు కావాలా షేకులు కావాలా షోకులు కావాలా కిస్సు కేకులు కావాలా షాకులు షేకులు చూపుల బాకులు మొత్తం కావాలా మొకే కావాలా మోజే కావాలా ప్రతిరోజు కావాలా తద్దినక తాకిడి కావాలా ఓ లంగరు లచ్చీ లబ్జనక రాపిడి కావాలా హే తద్దినక తాకిడి కావాలా ఓ లంగరు లచ్చీ లబ్జనక రాపిడి కావాలా ఓసి అందగాడా అబ్బోసి షోకుమాడా దూకుడంత చూడ అదిరింది కుర్రదూడ తద్దినక తాకిడి కావాలి ఈ లంగరు లచ్చికి లబ్జనక రాపిడి కావాలీ తక తక తక తద్దినక తాకిడి కావాలి ఈ లంగరు లచ్చికి లబ్జనక రాపిడి కావాలీ హే గుమ్మలురి పిల్ల నా సమ్మలోరికిల్లా చెక్కేస్తా ఎల్లా చేస్తాను ఒళ్ళు గుల్లా చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి హే హే హే అరె చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి హే హే హే లబ్జనక రాపిడి కావాలి ... లబ్జనక రాపిడి కావాలి ... లబ్జనక రాపిడి కావాలి ... ఏహే... ఏహే...

17, జులై 2021, శనివారం

Simhadri : Cheema Cheema Song Lyrics (చీమ చీమ చీమ చీమ చీమ)

చిత్రం: సింహాద్రి సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: S.P.చరణ్, గంగ, బ్రహ్మానందం

కస్తూరి భంగు భంగు కావేరి మింగు మింగు పిల్లతో పింగు పాంగు చిత్రాల చిందేసి సింగు సాంగు జింగల్లో జింగ దొరికింది దొంగ ముద్దే ఇవ్వంగ నీ మూతే బుంగ కసు బుస్సె ఎస్సై పోవంగా... చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా జింగల్లో జింగా టింగుల్లో రంగ అనిపిస్తా ఉంగ తీరుస్తా బెంగ హైలెస్సా తస్సాదియ్యంగా చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోరా మామా హోయ్ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోరా మామా చరణం: 1 అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా వయసంతా హరతి ఇస్తే వయ్యారి గుళ్ళోకొస్తా ఓలమ్మీ ఈడే కోడై కొక్కొరొక్కో అంటే అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా పొగరానిది సెగవున్నది సొగసొక్కటే కదా చెంగులు జారే చెడుగుడు గుళ్ళో చెమటలు పోసే ఒడిదుడుకుల్లో చెప్పక తప్పని తిప్పలు ఓరయ్యో ఓ ఓ ఓ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా జింగల్లో జింగా టింగుల్లో రంగ అనిపిస్తా ఉంగ తీరుస్తా బెంగ హైలెస్సా తస్సాదియ్యంగా చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా చరణం: 2 అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా కుర్రాడు కన్నే కొట్టే కుర్రీడు నన్నే కుట్టే చిర్రెత్తి చీరే తిడ్తే సిగ్గే పుడుతుంటే అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా ఎద కంటికి కధ కంచికి పొదరింటకే పదా చలి చలి వణుకున దుప్పటి దిక్కు చాలని వయసున కుంపటి దిక్కు తిప్పలు తప్పని కంపటి లేవమ్మో చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోరా మామా జింగల్లో జింగ దొరికింది దొంగ ముద్దే ఇవ్వంగ నీ మూతే బుంగ కసు బుస్సె ఎస్సై పోవంగా చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోరా మామా చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా


16, జులై 2021, శుక్రవారం

Simhadri : Nannedo Syeeamaku Song Lyrics (నన్నేదొ సెయ్యమాకు)

చిత్రం:సింహాద్రి(2003)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం:చంద్రబోస్

గానం: ఎం. ఎం. కీరవాణి, సునీత



నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ..హేయ్.హాఆ.. ఏదేదొ సెయ్యమాకు ఏటి కాడ..హేయ్..హాఆ.. ముద్దులెట్టి ముగ్గుల్లో దించమాకు ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు నేనింక చిన్నదాన్నిరో..  సాకేదొ సెప్పమాకు సందకాడ..ఏ సోకంతా దాచుకోకు ఆడ ఈడ..మ్మ్..ఏ అడ్డమైన సిగ్గు నువ్వు చూపమాకు అడ్డు గోడ పెట్టి నన్ను ఆపమాకు అలవాటు చేసుకోవమ్మో నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ..మ్మ్..హా.ఆ.. కంది చేనుకు షికారుకెళితె కందిరీగే నను కుడితే కంది చేనుకు షికారుకెళితె కందిరీగే నిన్ను కుడితే మంట నాలో మొదలవుతుంటే  మందు నేనె ఇస్తుంటే పెదవి ఎంగిలి పైపైన పూస్తె బాధ తగ్గి బాగుంది అంటు హాయిగ కనులే మూస్తే ఏదేదొ సెయ్యమాకు ఆడ ఈడ..హే...హాఆ.. నన్నేదో సెయ్యమాకు అందగాడా .. హేయ్.. హాఅ..  అంతకంటె హాయిగుంది వదులుకోకు ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు అలవాటు చేసుకోవమ్మో చింతపల్లి సంతకు వెళితె ఓ.. చింతపూల చీర కొంటే  మ్..చింతపల్లి సంతకు వెళితె చింతపూల చీర కొంటే కట్టు నీకు కుదరకపోతే నువ్వు సాయం చేస్తుంటే  చెంగు బొడ్లో దోపుతువుంటె చెంగు మని నువు వులిక్కి పడగా నాలో వుడుకే పుడితే సాకేదొ సెప్పమాకు సందెకాడ..హా..ఏ సోకంతా దాచుకోకు కోక నీడ..హే...ఏ పెళ్ళి చీర కట్టే దాక రెచ్చిపోకు పెద్ద పెద్ద ఆటలేవి ఆడమాకు అలవాటు చేసుకోవయ్యో..ఓఓఓ.. నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ..  హేయ్..హా...ఆ.. హేయ్... హ్మ్...

Simhadri : Ammaina Nana Aina Song Lyrics ( అమ్మైనా నాన్నైనా )

చిత్రం:సింహాద్రి(2003)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కళ్యాణి మాలిక్


గిరినీమె గలగాల గిరితీతి బైమారె బియ్యాన దెకదెకో జురతీతి బైమా అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా..... చాల్లే అని ఎవరైనా ఆపుంటే ఎపుడైనా సయ్యాట సాగేనా... ఎగసే కెరటాన... అమ్మానాన్నా ఉంటే ... అమ్మో మా ఇబ్బందే.... కాస్తయినా అల్లరి చేసే వీల్లేదే  అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా..... సూరీడుకి నాన్నుంటే స్కూల్లో పెడతానంటే పగలైనా వెలుతురు వస్తుందా.. జాబిల్లికి అమ్ముంటే ఒళ్ళో జోకొడుతుంటే రాతిరేళ వెన్నెల కాస్తుందా... నిను చేరేనా... నా లాలనా... ఏనాటికైనా ఓ పసికూనా... ఆడిందే ఆటంట ... పాడిందే పాటంట ఆపేందుకు అమ్మానాన్నా లేరంట.. సరదాగా రోజంతా తిరగేనా ఊరంతా ఊరేగే చిరుగాలికి ఉండుంటే అమ్మా అలుపంటూ లేకుండా చెలరేగి ఉరికేనా... ఉప్పొంగే సెలయేటికి ఉండుంటే నాన్న... అలిగిందా రా చిలకా ....కూచుందా కిమ్మనక... నాతో మాటాడేదెవరింకా రానందా నావంక ... దాగుందా కొమ్మెనకా... అమ్మో మరి నాకేం దారింకా... ఏది ఏది రానీ రానీ నన్నేరుకోనీ ముత్యాలన్నీ నీ నవ్వే చాలంటా పులకించే నేలంతా పున్నాగ పువ్వులతొటయ్యేనంట... గిరినీమె గలగాల గిరి తీతి బైమారె బియ్యాన దెకదేకో జరతీతి బైమా జగలోన సుగుణాల పలుమారు సుడాలే సరిపోలు జడివాన ఒదిగే ఈగాలి దిక్కుల్నే దాటాలి చుక్కల్నే తాకాలి... ఆనందం అంచుల నేడే చూడాలి... గిరినీమె గలగాల గిరి తీతి బైమారె బియ్యాన దెకదేకో జరతీతి బైమా జగలోన సుగుణాల పలుమారు సుడాలే సరిపోలు జడివాన ఒదిగే ఈగాలి