25, జులై 2021, ఆదివారం

Sri Ramulayya : Bhoomiki Pachchani Song Lyrics (భూమికి పచ్చాని రంగేసినట్టో )

 

చిత్రం : శ్రీరాములయ్య (1998) సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ రచన : కలెకూరి ప్రసాద్ గానం : కె.జె.ఏసుదాస్, బృందం



భూమికి పచ్చాని రంగేసినట్టో అమ్మలాలా పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా ఆలి పుస్తెలమ్ముకొని అప్పు తీర్చుకుంటివో అమ్మలాలా వలవలవల ఏడ్చుకుంటూ వలసెల్లిపోతివో అమ్మలాలా పురుగులమందే నీకు పెరుగన్నమాయనో అమ్మలాలా చెరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో పంటలు చేతికొస్తే పండుగ చేద్దామురో ॥ చరణం : 1 జాతరమ్మ జాతరమ్మ కూలిజనం జాతరో అమ్మలాలా ఎత్తుపల్లాలనే చదును చేసే జాతరో అమ్మలాలా చేలు దున్ని చాళ్లుదీసె బీదబిక్కి జాతరో అమ్మలాలా ఎద్దుకొమ్మల నడుమ ఎర్రపొద్దు పొడిచెరో భూస్వామి గుండెలధర గుడిసెలోల్ల జాతర ॥ చరణం : 2 చెమట జల్లు చిలకరిస్తే నేల పులకించురో అమ్మలాలా వానొస్తే భూతల్లి శీమంతమాడురో అమ్మలాలా తంగెళ్లు గన్నేర్లు పసుపు కుంకుమిచ్చురో అమ్మలాలా పశుల మెడన చిరుగజ్జెలు ఘల్లున మ్రోగేనో గజ్జెల మోతల్లో పల్లె పరవశించెను ॥ చరణం : 3 ఎగువ పెన్నమ్మమతల్లి ఎగిరెగిరి దుమికితే అమ్మలాలా తుంగభద్రమ్మ పొంగి పరవళ్లు తొక్కితే అమ్మలాలా చిత్రంగ చిత్రావతి చిందులు ఆడితే అమ్మలాలా నేలతల్లి నీళ్లాడి పసిడిపంటలిచ్చురో నా సీమకన్నుల్లో వెలుగులు నిండేనురో ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి