25, జులై 2021, ఆదివారం

Sri Ramulayya : Nanuganna Naa Thalli Song (నను గన్న నా తల్లి రాయలసీమ)

చిత్రం: శ్రీ రాములయ్య (1999)

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

సాహిత్యం: గోరెటి వెంకన్న

గానం:  S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ వానగాలికి సీమ తానమాడినపుడు వజ్రాలు ఈ నేల వంటిపై తేలాడు పొరలు నిమిరితే పుష్య రాగాలు దొర్లు రాగాలు దొర్లు బంగారు ఘనులున్న కుంగదీ తల్లీ పొంగిపోదమ్మా కలియుగంబున నరులు ఓర్వలేరని తెలిసి నల్ల రాయై వెలసి ఎల్లలోకములేలు వెంకటాచలము భువైకుంఠ స్థలమో వైకుంఠ స్థలము దర్శించినా జన్మా ధాన్యమౌతాదో పుణ్యమౌతాదో నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ హరిహరభుక్తరాయ అడివి వేటాకెళితే కుందేళ్లు కుక్కల ఎంటబడ్డాయంట పౌరుషాల పురిటి జీవగడ్డమ్మో  జీవగడ్డమ్మో ప్రతినబట్టిన శత్రువిక పతనమేరా ఇక పతనమేరా పాపాలు కడిగేటి పాతాళ గంగమ్మ ఆధి గురువుల తపము నాచరించెను బిలము హటకేశ్వర శిఖరమవని కైలాసం అవని కైలాసం తనుకుతా వెలసిన శివలింగమమ్మో శ్రీశైలమమ్మో నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ సత్రాలు సాధువులు భైరాగి తత్వాలు సీమ ఊరూరున మారు మ్రోగుతాయి శిథిలమైన గుళ్ళు శివనందులమ్మో శివనందులమ్మో వీరబ్రహ్మం ముఠము సీమకే మఖుటం సీమకే మఖుటం పాలబుగ్గల నోట వేణువు మీటితే ఆలమందలు కంచె బీళ్లు పరవశించు నింగిలో చంద్రుడు తొంగిచుసితే  తొంగిచుసితే సీమలో కోలాటమే సిందుతొక్కు చిరుగజ్జలాడు నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ ఎత్తు బండరాళ్లు ఎర్రని దుప్పులు పనుగు రాళ్ళ గట్లు పరికి కంపపొదలు నెర్రెడ్డు వారిన నల్లరేగళ్ళు నల్లరేగళ్ళు ఆరు తడుపుకు పెరిగే వేరు సేనగమ్మో వేరు సేనగమ్మో నల్లమల్లడవుల్లోతెల్లబారే పొద్దు అంబకేలకి సీమ మీదగ్గి కురిపించు సందేపూట నుండి కొండ నీడల్లో కొండ నీడల్లో సల్లగాలికి ఒళ్ళు మరచి నిదురించు అలసి నిదురించు నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ ఓహో... ఓ ఓ ఓ... ఆహా హా హా  ఓ హే హా ఓ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి