చిత్రం: శ్రీ రాములయ్య (1999)
సాహిత్యం: సంఘ
గానం: వందేమాతరం శ్రీనివాస్
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
పోరాటాల రాములు నీకు లాల్ సలాములు పోరాటాల రాములు నీకు లాల్ సలాములు వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం పోరాటాల రాములు... అ అ అ అ అ ఆ ఆ ఆ ఆ ఆకలికి అన్నం దొరికే దారి చూపిన వాడా! నీ హత్యకు ఉడుకుతుంది ఊరూరు వాడ వాడా అందుకనే పేద రైతూ ఊ ఊ ఊ... అందుకనే పేద రైతులేత్తినారు కత్తులు రాలిపడక తప్పదు భూస్వామి తలల గుత్తులు రాలిపడక తప్పదు భూస్వామి తలల గుత్తులు పోరాటాల రాములు నీకు లాల్ సలాములు వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం బీద బిక్కి బడుగోలను కూడ గట్టి నిలిపినావు సాహసమే ఊపిరిగా సమరాలను నడిపినావు సివాయి జమ భూముల్లో ఓ ఓ ఓ ఓ... సివాయి జమ భూముల్లో నువ్వెత్తిన ఎర్ర జెండ ఎగరేస్తాం ఎర్ర కోట బురుజులపై తప్పకుండ ఎగరేస్తాం ఎర్ర కోట బురుజులపై తప్పకుండ పోరాటాల రాములు నీకు లాల్ సలాములు పోరాటాల రాములు నీకు లాల్ సలాములు వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం పోరాటాల రాములు...