Thoorpu Padamara లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Thoorpu Padamara లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

Thoorpu Padamara : Swaramulu Edaina Raagalu Enno Song Lyrics (స్వరములు ఏడైనా )

చిత్రం: తూర్పు పడమర (1976)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

సంగీతం: రమేష్ నాయుడు

గానం: పి.సుశీల



స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో హృదయం ఒకటైనా భావాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో అడుగులు రెండైనా నాట్యాలెన్నో అడుగులు రెండైనా నాట్యాలెన్నో అక్షరాలు కొన్నైనా కావ్యాలెనెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో జననంలోనా కలదు వేదనా మరణంలోనా కలదు వేదనా జననంలోనా కలదు వేదనా మరణంలోనా కలదు వేదనా ఆ వేదన లోనా ఉదయించే నవ వేదలెన్నో నాదలేన్నోనాదలేన్నోనో స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో నేటికి రేపొక తీరని ప్రశ్న రేపటికి మరునాడొక ప్రశ్న కలమానే గాలనికి చిక్కి కలమానే గాలనికి చిక్కి తేలని ప్రశ్నలు ఎనేన్నో ఏనేన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో కనులునందుకు కలలు తప్పవు కలలునపుడు పీడ కలలు తప్పవు కనులునందుకు కలలు తప్పవు కలలునపుడు పీడ కలలు తప్పవు కలల వెలుగు లో కన్నిరోలికే కలల వెలుగు లో కన్నిరోలికే కలతల నీడలు ఎనేన్నో

Thoorpu Padamara : Thoorpu Padamara Song Lyrics (తూర్పు పడమర)

చిత్రం: తూర్పు పడమర (1976)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

సంగీతం: రమేష్ నాయుడు

గానం: కోవెల సంత , పి. సుశీల



తూర్పు పడమర ఎదురెదురూ నింగీ నేలా ఎదురెదురూ కలియని దిక్కులు కలవవనీ తెలిసి ఆరాటం దేనికనీ ఈ ప్రశ్నకు బదులేది? ఈ సృష్టికి మొదలేదీ?       "2" చరణం: తూర్పున ఉదయించే సూర్యుడు పడమర నిదురించును పడమట నిదురించే సూర్యుడే తూర్పున ఉదయించును. ఆ తూర్పు పడమరకేమౌను? ఈ పడమర తూర్పుకేమౌను? ఈ ప్రశ్నకు బదులేది? ఈ సృష్టికి మొదలేదీ?  "తూర్పు" చరణం: నింగిని సాగే నీలిమేఘం నేల ఒడిలో వర్షించును నేలను కురిసే ఆ నీరే నింగిలో మేఘమై పయనించును. ఈ నింగికి నేల ఏమౌను? ఈ నేలకు నింగి ఏమౌను? ఈ ప్రశ్నకు బదులేది? ఈ సృష్టికి మొదలేది?      "తూర్పు" చరణం : వేయని నాటకరంగంపైప వ్రాయని నాటక మాడుతున్నాము సూత్రధారికి పాత్రధారులకు తేడా తెలియక తిరుగుతున్నాము. నాటకమే ఒక జీవితమా? జీవితమే ఒక నాటకమా? ఈ ప్రశ్నకు బదులేది? ఈ సృష్టికి మొదలేది? జీవితమే ఒక నాటకమయితే నాటకమే ఒక జీవితమయితే పాత్రలు ఎక్కడ తిరిగినా సూత్రధారి ఎటు తిప్పినా కథ ముగిసే లోగా కలవకుందురా ఆ సూత్రధారి తానే కలవకుండునా! విన్నవా! ఇది విన్నావా సూర్యుడా, ఉదయసూర్యుడా! పడమటి దిక్కున ఉదయించాలని భ్రాంతి ఎందుకో? సృష్టికి ప్రతిసృష్టి చేసే దీష్టి మానుకో నిన్ను ఆశగా చూసే కనులకు కన్నీరే మిగిలించకు - ఇంకా ఇంకా రగిలించకు చంద్రుని చలువను పంచుకో నిన్నటి ఆశలు తెంచుకో   "తూర్పు" చరణం:  కోటి వీణియలు గుండె అంచులను మీటి నావా దేవా? కొండవిడిచి ఆ కోన విడిచి కై దండ నొసగి కాపాడవా ఇక ఆడలేను ఈ నాటకం - అలసిపోయె నా జీవితం రావయ్యా! దిగిరావయ్యా ఇదే ఇదే నా మంగళగీతం

31, జులై 2021, శనివారం

Thoorpu Padamara : Shivaranjani Navaragini Song Lyrics (శివరంజని నవరాగిణి)

చిత్రం: తూర్పు పడమర (1976)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

సంగీతం: రమేష్ నాయుడు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృత వాహిని రాగల సిగలోన సిరిమల్లివీ సంగీత గగనాన జాబిల్లివీ స్వర సుర ఝారి తరంగానివీ స్వర సుర ఝారి తరంగానివీ సరస హృదయ వీణ వాహినీ శివరంజని నవరాగిణి ఆ కనులు పండు వెన్నల గనులు ఆ కురులు ఇంద్ర నీలాల వనులు ఆ వదనం అరుణోదయ కమలం ఆ అధరం సుమధుర మధు కలశం... శివరంజని నవరాగిణి జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి వేణుధరుని రథమారోహించిన విదుషిమణి రుక్మిణి రాశికృత నవరసమయ జీవన రాగాచంద్రికా లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా రావే..... రావే నా శివరంజని... మనోరంజని రంజని నా రంజని నీవే నీవే నాలో పలికే నాదానివీ నీవే నాదానివీ నా దానివి నీవే నాదానివీ