చిత్రం: తులసి(2006)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: వేణు, సునీత
వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా
ఉండేలాగా చేసావే ఓ ప్రియా
చేదు ఇంత తీయ్యగ బాధ కూడా హాయిగా
ఉంటుందని నేర్పావ్ ఓ ప్రియా
చీకట్లో సూరీడు పొద్దున్నేమో జాబిల్లి
వచ్చాయి నువ్వే నవ్వంగ
నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి
చేరాయి నువ్వే చూడంగా
వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా
ఉండేలాగా చేసావే ఓ ప్రియా
చేదు ఇంత తీయ్యగ బాధ కూడా హాయిగా
ఉంటుందని నేర్పావ్ ఓ ప్రియా
నా పేరే అనుకుంటూ నీ పేరు నేను రాసానే
నా రూపే అనుకుంటూ నీ రూపు నేను గీసానే
తీయంగా తీవ్రంగా ఎదో ఎదో అవ్వంగా
ప్రేమంటూ కానే కాదంట
ఎత్తంగా కొత్తంగా ప్రేమను మించే పదమింకా
మన జంట కనిపెట్టాలట
వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా
ఉండేలాగా చేసావే ఓ ప్రియా
చేదు ఇంత తీయ్యగ బాధ కూడా హాయిగా
ఉంటుందని నేర్పావ్ ఓ ప్రియా
గాలైన నిన్ను చోడితే ఎనలేని ఈర్ష్య కలిగింది
నెలైనా నిను తిడితే ఎదలో అసూయ కలిగింది
ఘాడంగా గర్వాంగా జోడి మనమే కట్టంగా
ఏడే జన్మలు సరిపోవంట
దేవుళ్ళే మనకోసం పగలు రేయి పనిచేసి
ఎన్నో జన్మలు సృష్టించాలట
వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా
ఉండేలాగా చేసావే ఓ ప్రియా
చేదు ఇంత తీయ్యగ బాధ కూడా హాయిగా
ఉంటుందని నేర్పావ్ ఓ ప్రియా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి