చిత్రం: వర్షం(2004)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కార్తీక్, శ్రేయ ఘోషల్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
పల్లవి :
కోపమా నాపైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా చాలులే నీ నటన సాగవే ఇటుపైనా ఎంతగా నస పెడుతున్నా లొంగిపోనె లలనా దరి చేరిన నెచ్చెలిపైన దయ చూపవ కాస్తైన మన దారులు ఎప్పటికైనా కలిసేనా
చరణం: 1 : కస్సుమని కారంగా కసిరినది చాలింక ఉరుము వెనుక చినుకు తడిగా కరగవా కనికారంగా కుదురుగా కడదాక కలిసి అడుగేయవుగా కనుల వెనుకే కరిగిపోయే కలవి గనుక నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా నువు గొడుగును ఎగరేస్తావే జడివానా కోపమా నాపైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా చరణం: 2:
తిరిగి నిను నాదాక చేర్చినది చెలిమేగా మనసులోని చెలియవమ్మా చెరిపినా చెరగవుగనుక సులువుగా నీలాగా మరచిపోలేదింకా మనసు విలువ నాకు బాగా తెలుసుగనుక ఎగసే అల ఏనాడైనా తన కడలిని విడిచేనా వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా కోపమా నాపైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి