చిత్రం: ఆహుతి(1987)
సంగీతం: సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పల్లవి : అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం. అందిఅందని నా ఆశలకు ఆమె ప్రతిరూపం.
అతలపే నా ధ్యానం అ అభినవా దేవత నా ప్రాణం.... అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం.
అంది అందని నా ఆశలకు ఆమె ప్రతిరూపం..
చరణం 1 మల్లెపులకన్న మంచుపోరాలకన్న
నా చెలి మూసి మూసి నవ్వులు అందం.
అ... నెమలి హొయలనన్న సెలయేటి లయాలకన్న
నా చెలి జిలిబిలి నడకలు అందం.అపురూపం
అ నవలావణ్యం..ఆది నా మదిలో చెదరని స్వప్నం.
అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం.
అందిఅందని నా ఆశలకు ఆమె ప్రతిరూపం.
చరణం 2 పైడిబొమ్మలాంటి ఆమె పక్కనుంటే పగలే వెన్నెల నే కురిపిస్తా.. హ..నీడలాగ నాతో ఎడడుగులు సాగితే ఇలలో స్వర్గం నే సృష్టిస్తా. రసరమ్యం అ రాగవిలాసం రసరమ్యం అ రాగవిలాసం. వసివాడదు ఆది అ జన్మాంతం..
అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం.
అంది అందని నా ఆశలకు ఆమె ప్రతిరూపం.
అతలపే నా ధ్యానం అ అభినవదేవత నా ప్రాణం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి