17, ఆగస్టు 2021, మంగళవారం

Matru Devo Bhava : Raagam Anuraagam Song Lyrics (రాగం అనురాగం..సంసారం..మ్మ్)

చిత్రం : మాతృ దేవో భవ (1991)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


పల్లవి:- రాగం అనురాగం..సంసారం..మ్మ్  బంధం అనుబంధం..సంగీతం..మ్మ్  ఇద్దరుంటే పంచదార..సాగరం ఇల్లు చూస్తే మల్లె పూల పంజరం..అహహా..ఆ  రాగం అనురాగం సంసారం..బంధం అనుబంధం సంగీతం  చరణం:-1 గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ ఏంటో చెప్పమ్మా..తేలు  పగలేమో రెండే కాళ్ళు చీకటి పడితే నాలుగు కాళ్ళు జంతువు కాదు మనిషే..ఎవరు..?ఇంకెవరు నాన్నే..ఏయ్ చిరు చిరు నవ్వుల్లో చిన్నారి గువ్వల్లో..చీకటింట దీపమెట్టాలా కనులు అదిరేలా..హా..కలలు కనవేలా  ముసి ముసి ముద్దుల్లొ ముక్కుతున్న పొద్దుల్లో వెన్నెలింట వేడే పుట్టాలా పెదవి వెనకాలా హా..మధువులొలకాలా ఒడిలో పాప బడిలో పాప జతకీ కంటి పాపా యెదలో పాప యెదుటే పాప చెలి నా పాప చెలాకి సొగసుల రాగం అనురాగం సంసారం..మ్మ్..బంధం అనుబంధం సంగీతం..మ్మ్ చరణం:-2 రాతిరి చేసిన తప్పుల్ని పొద్దుట మన్నించేస్తుంది ఎన్ని సార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది ఆ దేవతెవరు? కనకదుర్గమ్మ..కాదు పోలేరమ్మా..కాదు..మరియమ్మా..కాదమ్మా..మీ అమ్మ తొలకరి తోటల్లొ వాగుల్లో వంకల్లో ఎంకి పాట ఏకం అవ్వాలా మనసు కవి పాటా..హ..మనకు విరిబాటా తిరుపతి కొండల్లో కోనల్లో కోవెల్లో ఏడు జన్మలేకం అవ్వాలా తెలుగు హరి పాటా..హ..తేనియల తేటా  చిరు కోపాల చెలి రూపాలు పరిచే పక్కపాలు  తమ తాపాల కసి దూపాలు అపుడే కాదు పదండి అనగల రాగం అనురాగం సంసారం బంధం అనుబంధం సంగీతం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి