చిత్రం: తలంబ్రాలు (1987 )
సంగీతం:సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: పి. సుశీల
పల్లవి: ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా.. రోదన లయగా.. సాగే గానమిది ఆ......ఆ....ఆ....ఆ....ఆ... ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు చరణం 1: ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు.. చెంతకు చేరదీసినాడు అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మిందీ.. తన హృదయం పరిచిందీ ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులనీ... తను బలియై పోతిననీ ఆ లేడి గుండె కోత.. నా గాధకు శ్రీకారం నే పలికే ప్రతి మాటా స్త్రీ జాతికి సందేశం ఆ...ఆ....ఆ....ఆ...ఆ... ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు చరణం 2: ఇప్పుడు కూడా నయవంచకులు ఇంద్రులు ఉన్నారు... కామాంధులు ఉన్నారు వారి చేతిలో వందలు వేలు బలి ఔతున్నారు... అబలలు బలి ఔతున్నారు నిప్పులు చెరిగే ఈ అమానుషం ఆగేదెప్పటికీ... చల్లారేదెప్పటికీ ఆ మంటలారుదాకా నా గానామాగిపోదు ఆ రోజు వచ్చుదాకా నా గొంతు మూగపోదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిదీ ఆ....ఆ....ఆ....ఆ...ఆ... ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి