12, ఆగస్టు 2021, గురువారం

Bhakta Tukaram : Ghana Ghana Sundaraa Song Lyrics (ఘనాఘన సుందరా)

చిత్రం: భక్త తుకారాం (1978)

సంగీతం: పి. ఆదినారాయణరావు

సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి

గానం: ఘంటసాల


పల్లవి:

హరి ఓం... హరి ఓం... హరి ఓం... ఆ... ఆ... ఆ... ఘనాఘన సుందరా కరుణా రసమందిరా ఘనాఘన సుందరా కరుణా రసమందిరా అది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపో అది మధుర మధుర మధురమౌ ఓంకారమో పాండురంగ... పాండురంగ... ఘనాఘన సుందరా కరుణా రసమందిరా చరణం 1: ప్రాభాత మంగళపూజావేళ నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి ప్రాభాత మంగళపూజావేళ నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి నిఖిల జగతి నివాళులిడదా... నిఖిల జగతి నివాళులిడదా వేడదా... కొనియాడదా... పాండురంగ... పాండురంగ... ఘనాఘన సుందరా కరుణా రసమందిరా చరణం 2: గిరులూ ఝరులూ విరులూ తరులూ... నిరతము నీ పాద ధ్యానమే... నిరతము నీ నామ గానమే గిరులూ ఝరులూ విరులూ తరులూ నిరతము నీ పాద ధ్యానమే... నిరతము నీ నామ గానమే సకల చరాచర లోకేశ్వరేశ్వరా... సకల చరాచర లోకేశ్వరేశ్వరా శ్రీకరా... భవహరా...పాండురంగ... పాండురంగ... ఘనాఘన సుందరా కరుణా రసమందిరా ఘనాఘన సుందరా కరుణా రసమందిరా పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి