చిత్రం. : భక్త తుకారాం (1973)
సంగీతం : ఆదినారాయణ రావు
గానం : వి రామకృష్ణ
రచన : దాశరథి
పడవెళ్ళిపోతుందిరా...
పడవెళ్ళిపోతుందిరా ఓ మానవుడా దరి చేరే దారేదిరా నీ జీవితము కెరటాల పాలాయెరా పడవెళ్ళిపోతుందిరా.. తల్లిదండ్రి అతడే నీ ఇల్లు వాకిలతడే తల్లిదండ్రి అతడే నీ ఇల్లు వాకిలతడే ఆ పాండురంగడున్నాడురా నీ మనసు గోడు వింటాడురా నీ భారమతడే మోసేనురా ఓ యాత్రికుడా నిన్నతడే కాచేనురా.. పడవెళ్ళిపోతుందిరా... బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు ఇది శాశ్వతమని తలచేవురా నీవెందుకని మురిసేవురా నువు దరిచేరే దారి వెతకరా ఓ మానవుడా.. హరినామం మరువవొద్దురా.. పడవెళ్ళిపోతుందిరా... అనిగి మనిగి ఉండేవారే అందరిలోకి ఘనులు హొహోయ్ అనిగి మనిగి ఉండేవారే అందరిలోకి ఘనులు దొడ్డ మానులను కూల్చు తుఫాను గడ్డి పరకను కదల్చగలదా.. కదల్చగలదా... చిన్న చీమలకు చెక్కర దొరకును గొప్ప మనిషికి ఉప్పే కరువు.. ఉప్పే కరువు... అణకువ కోరే తుకారాముని మనసే దేవుని మందిరము మనసే దేవుని మందిరము హోయ్ అనిగి మనిగి ఉండేవారే అందరిలోకి ఘనులు హొహోయ్ అనిగి మనిగి ఉండేవారే అందరిలోకి ఘనులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి