చిత్రం: దొంగ మొగుడు (1987)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో నీ పొంగు చూసి మెచ్చి వచ్చానే ఇచ్చే రోజే వస్తే అన్నీ ఇస్తాలే ఊరించుతూ నన్ను వేధించడం న్యాయమా. ఆ. ఆ. ఆ. కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో కన్నెకుసుమం కన్ను గీటి నన్ను పిలిచిన వేళ తేనె వానల తాన మాడగ తేటినై నే రానా... లలలలలా కాటు వేసిన మోటు సరసం హాయి గురుతై పోగాఘుమ్ముఘుమ్ముగ కమ్ముకున్న మత్తు వరదై రాదా ఓ. ఓహో. ఓ. ఓ. మారం చేసే ఆరలన్నీ తీరాలి ఈ వేళలో. ఓ. ఓహో. ఓ. ఓ. పందెం వేసే అందాలన్నీ ఊగాలి ఉయ్యాలలో... ఆ. ఆ. ఆ. ఆ. ఆ. కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో వలపు వానా కురిసినాక వలపు వరదై పోదా కోరికలతో ఏరువాక సాగు తరుణం రాదా. లలలలలా కన్న కలలు కోతకొస్తే పుష్యమాసం రాదా శోభనాల సంకురాతిరి సంబరాలే కాదా... అహ.హ.హా.అహా.హ.హా తూనిగల్లే ఆనందాలే తేలాలి ఈ గాలిలో ఓ.ఓ.ఓ.ఓ. తేనేగల్లే మకరందాలే తూలాలి ఈ పూలలో... కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో నీ పొంగు చూసి మెచ్చి వచ్చానే ఇచ్చే రోజే వస్తే అన్నీ ఇస్తాలే ఊరించుతూ నన్ను వేధించడం న్యాయమా. ఆ. ఆ. ఆ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి