చిత్రం: భలే మావయ్య (1994)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: రాజ్ - కోటి
పల్లవి: M : మాటతో చెప్పలేని అందాలు నీలో చూశాలే F : పైటతో కప్పలేని ప్రాయాన్ని నీకై దాచాలే M : కూచిపూడి కులుకు నిలేసింది కూనలమ్మ పలుకు వలేసింది F : పడుచు వయసు నీకే ఎరేసింది గడుసు సొగసు నిన్నే పడేసింది M : శుభ సంకేతాలే సంగీతాలై పాడే ముహూర్తంలో మాటతో చెప్పలేని అందాలు నీలో చూశాలే చరణం 1: M : పనికట్టుకొచ్చిందిలే చెరో సగం భలే సుఖం F : కనికట్టు కట్టిందిలే కలే నిజం అయ్యే కాలం M : కళ్యాణ రాగమే పాడే మూర్తం కౌగిళ్ళ కోటలే ఏలాలి F : కన్యాధనం నివేదనం నువ్వు నేను మనం అయ్యే క్షణం M : పలకరింతలెన్నో అందించాలి F : వలపు వింతలెన్నో చూపించాలి M : చెలి ఒయ్యారాలే ఒళ్ళో చేరి ఉయ్యాలూగాలి F : హ హ హ M : మాటతో చెప్పలేని అందాలు నీలో చూశాలే చరణం 2: F : నసపెట్టే యవ్వనంలో నరం నరం చలిజ్వరం M : ఉసిగొలిపే ఉత్సవంలో నిరంతరం నిషాస్వరం F : ఊరికే ఒంటిగా ఊగే ప్రాయం ఊరేగే సంబరం ఊరిస్తే M : ఇహం పరం అందే వరం ఫలించని ఇలా స్వయంవరం F : మనసు మనసు కలిపి ముడెయ్యాలి mచిలిపి వయసు జగడం చల్లారాలి F : జత సయ్యాటంలో సంతోషాలే చిందులు వెయ్యాలి M : హ హ హ హ మాటతో చెప్పలేని అందాలు నీలో చూశాలే F : పైటతో కప్పలేని ప్రాయాన్ని నీకై దాచాలే M : కూచిపూడి కులుకు నిలేసింది కూనలమ్మ పలుకు వలేసింది F : శుభ సంకేతాలే సంగీతాలై పాడే ముహూర్తంలో M : హ హ హ
M : Male
F : Female