1, ఆగస్టు 2021, ఆదివారం

Bramha : Musi Musi Navvula lona Song Lyrics ( ముసి ముసి నవ్వులలోన )

చిత్రం: బ్రహ్మ (1992)

రచన: గురుచరణ్

గానం: జేసుదాస్

సంగీతం: బప్పీలహరి


ఆ... ఆ... ఆ... ఆ... అ ఆ... ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగే వాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన ఆరేళ్ళ పాప కోసం ఆనాడు పాడినా... అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడినా... అభిమానమున్న వాడ్ని అవమానపరచినా... యదలోని చీకటంతా వెన్నెలగ మార్చినా... బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన అనురాగ జీవితాన పెను గాలి రేగినా... తన వారు కాన రాక కను పాప ఏడ్చినా... కడగళ్ళ బ్రతుకులోన వడగళ్ళు రాల్చినా... సుడిగుండమైన నావ ఏ దరికి చేర్చినా... బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగే వాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి