చిత్రం : చంటి (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సాహితి
గానం: బాలసుబ్రహ్మణ్యం
జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిద్దరోవే చంటి పాడే జోలలోనే జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే పాలబువ్వ నా పలుకే హాయి నిద్ర పాపలకే వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే పాలబువ్వ నా పలుకే హాయి నిద్ర పాపలకే కూనలమ్మ నా పదమే తేనెకన్నా తియ్యనిదే కోనలన్నీ పాడుకునే గువ్వ చిన్న పాట ఇదే రాగముల తాళములు నాకసలే రావులే పాడుకొను జ్ఞానమునే నా కొసగే దైవమే ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిద్దరోవే చంటి పాడే జోలలోనే జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి