చిత్రం: సుందరకాండ (1992)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకే చందమామకి రూపముండదు తెల్లవారితే ఈ మజిలీ.. మూడునాళ్ళే.. ఈ జీవయాత్రలో ఒక పూటలోనే రాలు పూవులెన్నో నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా కన్నీటిమీద నావ సాగనేల నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా * కొమ్మలు రెమ్మలు గొంతేవిప్పిన కొత్తపూల మధుమాసంలో తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే చింతపడే చిలిపి చిలకా... చిత్రములే బ్రతుకు నడకా పుట్టే ప్రతి మనిషీ కనుమూసే తీరు మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు మమతానురాగ స్వాగతాలు పాడ నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా *ముల్లును పువ్వుగ బాధను నవ్వుగ మార్చుకున్న ఈ రోజాకి జన్మ బంధము ప్రేమ గంధము పూటే చాలులే పంజరమై బ్రతుకు మిగులు.. పావురమే బైటికెగురు మైనా క్షణమైనా పలికిందే భాష ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ విధిరాత కన్న లేదు వింత పాట నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా కన్నీటిమీద నావ సాగనేల నవ్వవే నవమల్లిక.. ఆశలే అందాలుగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి