చిత్రం: ధర్మ క్షేత్రం (1992)
సాహిత్యం: వేటూరి
గానం: మనో , కె.యస్.చిత్ర
సంగీతం: ఇళయరాజా
పల్లవి: కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య తడిసోకు దప్పడం తళుకెంతో నిబ్బరం అదిమేస్తే అప్పడం తిరగట్లో తిప్పడం కసిగా కొసలే కొరికేస్తా కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య చరణం:1 బుడమేటి ఈతల్లో పడిలేచే సోకుల్లో చిలిపి జలగవి ఒక చిన్న బుడగవి నీ ఎండమావుల్లో నా గుండె బావుల్లో బొచ్చె పరిగెవి ఒక పిచ్చి నురగవి నిన్నే సాధిస్తా నా సత్తాలు చూపిస్తా సైరా నా సందెపుడకా నిన్నే కవ్విస్తా నా కౌగిట్లో కట్టేస్తా రావే నా రంభ సిలకా వడ్డీ బురద కన్నే వాగే వరద నాకే సరదా పిల్లా నోరే దురద పెట్టావంటే ఫోజు దులిపేస్తా నీ బూజు హో.....హో.....హో..... కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య తస్సాదియ్యా దోబూచి దొబ్బుడాయి పో పో ఛీ బొమ్మిడాయి గిలిగుంటే గిల్లి చూడు ముడి తీస్తే మోపురం బిడియాల గోపురం సుడి చూస్తే సుందరం తొడగొట్టే తొందరం పగలే వగలే దులిపేస్తా… కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య చరణం:2 నీలాటి రేవుల్లో నీలాటి చేపల్లో సొగసు తడిసేలే నా పొగరు బెడిసెలే కళ్ళెట్టి చూస్తుంటే గాలాలే వేస్తుంటే పులస దొరుకునా మన వరస కుదురునా తోకే జాడించే చెలి కోకిట్టా పారేస్తే ఆరేస్తా తడి తునక నన్నే ఓడించి పగబట్టించి వేధిస్తే చూపిస్తా కసి నడక నేనే గడుసు నాకు నువ్వే అలుసు నీకేం తెలుసు కలవని కంట్లో నలుసు అరె ఎక్కిస్తా నా ఒడ్డు ఎవడొస్తాడో అడ్డు హే.....హే.....హే..... దోబూచి దొబ్బుడాయి పో పో ఛీ బొమ్మిడాయి గిలిగుంటే గిల్లి చూడు అరె కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య తడిసోకు దప్పడం తళుకెంతో నిబ్బరం అదిమేస్తే అప్పడం తిరగట్లో తిప్పడం కసిగా కొసలే కొరికేస్తా కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి