చిత్రం: దొంగ మొగుడు (1987)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
ఈ చెంపకు శెలవీయకు ఈ పెదవిని వదిలేయకు చాలని అనకు రాతిరి మనకు మోహాలు సంకెళ్ళు విడిపోనీకు... హోయ్ ఈ చెంపకు శలవీయకు ఈ పెదవిని వదిలేయకు నీ వేళ్ళు చేసే అల్లరి కుచ్చెళ్ళు పాడే పల్లవి తుఫాను రేగే ముందర ముస్తాబు దేనికి దండగ కంటి చూపు చీర కట్టాలి ఒంటిని కంచి పట్టు చీర జారాలి నేలనీ ఈ వేడీలో వాడనీ ...ఈ గాలినీ పూలనీ... గండి పడ్దది నింగి చెరువుకి వెండి వెన్నెల పొంగుతున్నదీ గోరింత తుళ్ళింత వెల్లువయ్యేలా... హోయ్ ఈ చెంపకు శలవీయకు ఈ పెదవిని వదిలేయకు చాలని అనకు రాతిరి మనకు మోహాలు సంకెళ్ళు విడిపోనీకు... హోయ్ పై పైకి రాకు సూర్యుడా పొద్దంటే మాకు చేదురా తెల్లారుతున్నా తీరక అల్లాడుతోందీ కోరికా కక్ష గట్టి వచ్చి మా తలుపు తట్టకు వెలుగు వలలు తెచ్చి మా తలలు పట్టకు ఈ రేయిని ఆగనీ... ఈ హాయినీ సాగనీ... పాలపుంతలో పూల వేడుక కౌగిలింతలో ఇలకు జారక తాపాల దాహాలు తీరిపోయేలా... ఈ చెంపకు శలవీయకు ఈ పెదవిని వదిలేయకు చాలని అనకు రాతిరి మనకు మోహాలు సంకెళ్ళు విడిపోనీకు... హోయ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి