చిత్రం: దొంగ మొగుడు (1990)
సంగీతం: చక్రవర్తి
రచన: రాజశ్రీ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
ఇడ్లీ పాపా ఇడ్లీ పాపా సాంబారు కావాలా చిట్టిగారెతో చట్నీ కలిపీ నోట్లో పెట్టాలా చూపులతోనే కాఫీ కాసి నేనే నీకూ ఇవ్వాలా వద్దని నువ్వూ పంతం పడితే నిన్నే బజ్జో పెట్టాలా హొయ్ ముద్దుల రాజా ముద్దుల రాజా ముచ్చట కావాలీ హొయ్ పంచదారతో పాలవయసును పాకం పట్టాలీ మీగడలాంటి ఆగడమంతా నీలో చూడాలి హొయ్ అందం చందం హంగూ పొంగూ నీకే సొంతం కావాలీ చరణం: 1 అబ్బా ఏమిటండి మీరు మరీను ఏమ్మా అక్కర్లేదా? కాదు.. హా మరేంటి?.. ఊఁ అరె వేసుకో.. పెనవేసుకో.. బుస కొట్టే నాగల్లే చేసుకో.. సడి చేసుకో.. చెలరేగే వాగల్లే కట్టుకో.. ఆకట్టుకో.. ఎద చాటున మాటేసీ.. చూసుకో.. గురి చూసుకో.. నీ చూపుల వలవేసీ.. పాలబుగ్గలో కొత్తపొంగులూ నన్నే ఊరించే కొంటె సైగలో కొండగాలులూ నన్నే ఊగించే నీ ముద్దును నేనైతే.. నా ముద్దర నీవైతే ఆహ నీ ముద్దును నేనైతే.. నా ముద్దర నీవైతే నిండింది నా మనసు నీ మాటతో పండింది నా పంట ఈనాటితో హొయ్ ఇడ్లీ పాపా ఇడ్లీ పాపా సాంబారు కావాలా చిట్టిగారెతో చట్నీ కలిపీ నోట్లో పెట్టాలా హొయ్ ముద్దుల రాజా ముద్దుల రాజా ముచ్చట కావాలీ హొయ్ పంచదారతో పాలవయసును పాకం పట్టాలీ చరణం: 2 హొయ్ రెచ్చిపో..ముడుపిచ్చిపో.. నువ్వు దాచిన ఈడంతా పంచిపో..కరిగించిపో..కైపెక్కిన మనసంతా చేరుకో.. ఇక చేదుకో.. నా సిగ్గుల పేరంటం పుచ్చుకో.. సరిపుచ్చుకో.. నా చూపుల తాంబూలం అరె తట్టితాకితే తాళమియ్యని ఎర్రని చెక్కిళ్ళు చిటికె వేసితే చిందులాడనీ నీలో సందళ్ళు అహ ఊరెను ఉవ్విళ్ళు.. ఎద కోరెను కౌగిళ్ళూ అహ ఊరెను ఉవ్విళ్ళు.. ఎద కోరెను కౌగిళ్ళూ నా చూపే నిలవాలి నీ ముందరా తెల్లార్లూ సాగాలీ ఈ జాతరా అహ ఇడ్లీ పాపా ఇడ్లీ పాపా సాంబారు కావాలా ఆఁ చిట్టిగారెతో చట్నీ కలిపీ నోట్లో పెట్టాలా ఆఁ చూపులతోనే కాఫీ కాసి నేనే నీకూ ఇవ్వాలా వద్దని నువ్వూ పంతం పడితే నిన్నే బజ్జో పెట్టాలా హొయ్ ముద్దుల రాజా ముద్దుల రాజా ముచ్చట కావాలీ ఆహా హొయ్ పంచదారతో పాలవయసును పాకం పట్టాలీ ఆహా మీగడలాంటి ఆగడమంతా నీలో చూడాలి అరెరెరె అందం చందం హంగూ పొంగూ నీకే సొంతం కావాలీ