చిత్రం:ఘరానా అల్లుడు(1994)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పల్లవి:
కొంగే జారిపోతుందే అమ్మమ్మో
చూపుల్తో ఎవరేం చేశారే
పొంగే భారమౌతుంటే అమ్మమ్మో
కాపాడే వారెపుడొస్తారే
చేరక ముందే సెగలే తగిలే
చాటున ఉండే వగలే రగిలే
రాగల రాజెక్కడే....హా....హా....
కొంగే జారిపోతుందే అమ్మమ్మో
చూపుల్తో ఎవరేం చేశారే
పొంగే భారమౌతుంటే అమ్మమ్మో
కాపాడే వారెపుడొస్తారే
చరణం:1
వెచ్చంగా వయ్యారం విచ్చంగా
వరున్నై వచ్చాగా శృంగారమా
అచ్చంగా వయస్సే మెత్తంగా
వరించా వాటంగా పురుషోత్తమా
అపురూపంగా అందించు అభిసారిక
అభిమానంగా బంధించు తవి తీరగా
కో అని కూసే తీయని ఊసే
దారులు కాసే తీరని ఆశే
కాముడికెదురేగగా హా....హా....
కొంగే జారిపోతుందే అమ్మమ్మో
చూపుల్తో ఎవరేం చేశారే
పొంగే భారమౌతుంటే అమ్మమ్మో
కాపాడే వారెపుడొస్తారే
చరణం:2
దాహంతో దహించే దేహంతో
తపస్సే చేస్తున్నా దయచేయవా
మోహంతో ముడేసే మోజుల్లో
తెగింపే చూస్తున్నా తెర తీయవా
నువ్వు సయ్యంటే సింగారం ముందుంచనా
నువ్వు ఊ అంటే మొగమాటం వదిలించనా
కాగల కార్యం జరిగే వరకు
కౌగిలి కోసం ఒకటే పరుగు
కంటికి కునుకుండకా....హా....హా....
కొంగే జారిపోతుందే అమ్మమ్మో
చూపుల్తో ఎవరేం చేశారే
పొంగే భారమౌతుంటే అమ్మమ్మో
కాపాడే వారెపుడొస్తారే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి