6, ఆగస్టు 2021, శుక్రవారం

Number One : Kolo Koloyamma Song Lyrics (కోలో కోలో కోయిలమ్మ కొండకోన బుల్లెమ్మ)

చిత్రం : నెంబర్ వన్ (1994 )

సంగీతం : ఎస్. వి. కృష్ణారెడ్డి

రచయిత : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


పల్లవి:

లలలలలలా లలలలలలా కోలో కోలో కోయిలమ్మ కొండకోన బుల్లెమ్మ ఏలో ఏలో వెన్నెలమ్మ ఏలాలమ్మ నా ప్రేమ వయ్యారం ఉయ్యాలూగి వయ్యా వయ్యా ఒంపుల్లో జంపాలూగి సయ్యా సయ్యా గువ్వలా చేరుకో గుండెలోనా కోలో కోలో కొమ్మరెమ్మ కొండకోన ఓయమ్మ ఏలో ఏలో చందమామ ఏలాలయ్య నా ప్రేమ వయ్యారం ఉయ్యాలూగి వయ్యా వయ్యా సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా గువ్వలా చేర్చుకో గుండెలోనా చరణం:1

తాకితే ఎర్రాని బుగ్గ తందానా మీటితే వయ్యారి వీణ తిల్లానా కలిపి చిలక వలపు చిలకగా కలువ చెలియ కలువ రమ్మని కిలకిలలో ఓ ఓ ఓ మురిపెములే అలలు అలలుగా జల్లులై వెల్లువై పొంగిపోయే కోలో కోలో కొమ్మరెమ్మ కొండకోన ఓయమ్మ ఏలో ఏలో వెన్నెలమ్మ ఏలాలమ్మ నా ప్రేమ చరణం:2

ఓ ప్రియా లాలించమంది వయ్యారం మోజులే చెల్లించమంది మోమాటం చిలిపి చూపు సొగసు నిమరగా జాజితీగ జడకు అమరగా గుసగుసలే... గుమగుమలై గుబులురేపగా జుమ్మని తుమ్మెదై కమ్ముకోవా కోలో కోలో కోయిలమ్మ కొండకోన బుల్లెమ్మ ఏలో ఏలో చందమామ ఏలాలయ్య నా ప్రేమ వయ్యారం ఉయ్యాలూగి వయ్యా వయ్యా సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా గువ్వలా చేరుకో గుండెలోనా కోలో కోలో కొమ్మరెమ్మ కొండకోన ఓయమ్మ ఏలో ఏలో వెన్నెలమ్మ ఏలాలమ్మ నా ప్రేమ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి