చిత్రం: హ్యాపీ డేస్(2007)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: వనమాలి
గానం:కార్తీక్
పాదమెటు పోతున్న పయనమెందాకైనా అడుగు తడబడుతున్న తోడురానా?! చిన్ని ఎడబాటైన కంట తడి బెడుతున్న గుండె ప్రతి లయలోన నేను లేన?! ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా?! O My friend! తడి కన్నులనే తుడిచిన నేస్తమా! O My friend! ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా!
అమ్మ వడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుందే జన్మకంతా తీరిపోనీ మమతలెన్నో పంచుతోందీ మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మొహమాటాలే లేనీ కళ జాలువారే! ఒంటరైన ఓటమైనా వెంట నడిచే నీడ నీదే! O My friend! తడి కన్నులనే తుడిచిన నేస్తమా! O My friend! ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా!
వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటీ చేతలన్నీ చెంతవాలే గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటు తళ్ళింతల్లో తేలే స్నేహం మొదలొ తొదలొ తెలిపే ముడె వీడకుందే ఒంటరైన ఓటమైనా వెంట నడిచే నీడ నీదే! O My friend! తడి కన్నులనే తుడిచిన నేస్తమా! O My friend! ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి