6, ఆగస్టు 2021, శుక్రవారం

Hello Alludu : Modati Mojulu Song Lyrics (మొదటి మోజులు రేగే వేళకి)

చిత్రం: హలో అల్లుడు (1994)

రచన:

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: రాజ్-కోటి



పల్లవి: మొదటి మోజులు రేగే వేళకి ప్రేమిస్తే ఏమిస్తావ్? నీతోనే జీవిస్తా... విరహ జాబిలి వేగే వేళకి వాటేస్తే ఏం చేస్తావ్? సోకుల్లో చోటిస్తా.... చిత్తై పోతున్నా నీకు మత్తెక్కిస్తున్నా ముంగిట్లో ముద్దు ముచ్చట్లాడిస్తుంటే ఓడిస్తుంటే ఎంతో హాయి మొదటి మోజులు రేగే వేళకి ప్రేమిస్తే ఏమిస్తావ్? నీతోనే జీవిస్తా... చరణం:1 ఈదురు గాలి ఈడుగా మారి చేసెనులే గోలలు నీలో ఈ దొరగారి తొందర చూసి రేగెనులే ఈలలు నాలో మల్లిజాజి మధువే నీ అందాలే చిలికే సుమా విచ్చే మొగ్గ గిల్లు గుచ్చే తేనె ముల్లు వేడెక్కించి ఒళ్లు డీడిక్కాడి వెళ్లు కోడె కన్ను కొట్టే కన్ను కోలాటంలో మొదటి మోజులు రేగే వేళకి ప్రేమిస్తే ఏమిస్తావ్? నీతోనే జీవిస్తా... చరణం:2 వెచ్చని తోడు మచ్చిక గూడు జాబిలితో రాతిరి గోల తెల్లని చీర వెన్నెల డేరా కౌగిలిలో కమ్మని ఈల కొత్తందాలే కొలిచి మొత్తం నీకై దాచుకొని సింగారంలో తడిసి సిగ్గంటిస్తే తుడిచి రూపాలెన్నో కలిసి దీపం లాగా మెరిసి రూపు రేఖ రాసే లేఖ అందే వేళ మొదటి మోజులు రేగే వేళకి ప్రేమిస్తే ఏమిస్తావ్? నీతోనే జీవిస్తా... విరహ జాబిలి వేగే వేళకి వాటేస్తే ఏం చేస్తావ్? సోకుల్లో చోటిస్తా.... చిత్తై పోతున్నా నీకు మత్తెక్కిస్తున్నా ముంగిట్లో ముద్దు ముచ్చట్లాడిస్తుంటే ఓడిస్తుంటే ఎంతో హాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి