6, ఆగస్టు 2021, శుక్రవారం

Rendilla Poojari : Veenallo Teega Yemandi Song Lyrics ( వీణల్లో తీగ ఏమంది)

చిత్రం : రెండిళ్ళ పూజారి (1993)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



వీణల్లో తీగ ఏమంది రాగాలు నీవే లెమ్మంది కొమ్మల్లో కూకు ఏమంది కోరింది నీకే ఇమ్మంది ముద్దంటి పూబంతి ముంగిళ్ల సంక్రాంతి కన్నాను నిన్నలేని నీలి ప్రేమలేఖలే వీణల్లో తీగ ఏమంది రాగాలు నీవే లెమ్మంది కొమ్మల్లో కూకు ఏమంది కోరింది నీకే ఇమ్మంది విరజాజి తిరునాళ్లలో వీడిదే నీవై పూబంతి విందులియ్యవా.. మొగిలాకు పొదరిళ్లలో మొగుడే నీవై సంపంగి ముద్దులియ్యవా.. రచించా ప్రేమ గీతం రసాల భాషలో రుచించే పూల వేగం నిషాలా తోటలో వయ్యారాల వాలుజెల్లో వాలుతున్న మందారాల తేనెకోసం తుమ్మెదై విన్నాను కొంగు చాటు కోడెగాలి పాటలే వీణల్లో తీగ ఏమంది రాగాలు నీవే లెమ్మంది కొమ్మల్లో కూకు ఏమంది కోరింది నీకే ఇమ్మంది పరువాల బరువేదించే పడవేనీవై తూచాలి మల్లెపూలతో తొలిసిగ్గు చలివేదించే కళికే నీవై దాచాలి ఆశ కళ్ళల్లో సహించా మాఘమాసం సఖా నీకోసమే గ్రహించ మౌనగీతం సఖి సందేశమే కొత్తందాల కోనసీమ చేరుకున్న గోదారొడ్డు గోకులానా రాధనై కావాలి యవ్వనాలా నవ్వుకున్న కౌగిలే వీణల్లో తీగ ఏమంది రాగాలు నీవే లెమ్మంది కొమ్మల్లో కూకు ఏమంది కోరింది నీకే ఇమ్మంది ముద్దంటి పూబంతి ముంగిళ్ల సంక్రాంతి కన్నాను నిన్నలేని నీలి ప్రేమలేఖలే వీణల్లో తీగ ఆహాహా.. రాగాలు నీవే లెమ్మంది కొమ్మల్లో కూకు హ్మ్మ్హ.. కోరింది నీకే ఇమ్మంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి