చిత్రం : మాతృ దేవో భవ (1991)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా... మబ్బులెంతగ కురిసినా ఆకాశం తడిసెనా మాటలతో మరపించినా.. మనసున వేదన తీరెనా.. విధి శోధన ఆగెనా... కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా... తనువే గాయాల గానమురళీ.. ఐనా మది మౌనరాగ రవళి ఉరిమే మేఘాలు చూసి కదిలి మెరిసే ఫించాలు విప్పె నెమలి పాటలెన్ని పలికించినా కంటికి జోలగ మారేనా.. ఎదగోలలు ఆగేనా.. కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా... మృతిలో తలదాచుకున్న బ్రతుకు శ్రుతిలో కలిపింది నిన్ను జతకు గుడిలో దైవాలు ఎందుకొరకు విధితో పొరాడు జంటకొరకు పొద్ధులెన్ని ఉదయించిన రేపటి చీకటి తీరేనా ఎడబాటిక ఇంతేనా.. కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా... మబ్బులెంతగ కురిసినా ఆకాశం తడిసెనా మాటలతో మరపించినా.. మనసున వేదన తీరెనా.. విధి శోధన ఆగెనా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి