14, ఆగస్టు 2021, శనివారం

Osey Ramulamma : Inta Ee Inti Song Lyrics (ఇంతి ఏ ఇంటి జానవే)

చిత్రం: ఒసేయ్ రాములమ్మ(1998 )

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ

గానం:వందేమాతరం శ్రీనివాస్, కె.యస్.చిత్ర

 

ఇంతి ఏ ఇంటి జానవే ఇంతి ఏ ఇంటి జానవే ముద్దులా పుబంతి యే వీధి రాణివే ఇంతి ఏ ఇంటి జానవే ఇంతి ఏ ఇంటి జానవే ముద్దులా పుబంతి యే వీధి రాణివే తీరు చేమంతుల పువ్వుల పేరు నీ సాటి కన్నెలే లేరు దివి కాంతలయినా సరిరారు నిను చూడపోతే కల పోదు చెలరేగే గుండె దడ హోరు శోభాంగి తెలుపు నీ పేరు నిను కన్నొళ్ళకు జోహారు పలుకవెలేనే పల్లె రంభ నీ వోళ్ళు చూసిన కళ్ళు తిరిగునే ఇంతి ఏ ఇంటి జానవే ముద్దులా పుబంతి యే వీధి రాణివే దారికేదురుగా నిలువ బోకు నాతోటి నువ్వు కారు కూతలు వదురబోకు నీరి ఎత్తువు తీరుగా ఎటు దురి చెడునుడుగులతో చేరి ఆపదలను పొందకు కోరి తలచకుర నను సుకుమారి కనిపించును నాలో మారి చూపించును నరకపు దారి మరియాదగా వెళ్ళుము రోరి చాలు చాలు నీ కలువ కూతలు ఇక డోలి వదులుకొని ఇల్లు చేరుకో దారికేదురుగా నిలవ బోకు నాతోటి నువ్వు కారు కూతలు వదురబోకు కళ్ళు రస పిపాసులకు సంకెళ్ళు రతి సదనానికి వాకిళ్లు ఆ స్వర్గమునే నాకిల్లు చేయింతు విప్పు నీ ముళ్ళు పోదాం పదవే పొదరిల్లు నేను ఒక వేశ్య కాంతను కాను ఉచ్వాసి వాంఛలో లేను పేరున్న ఇంట పుట్టాను తలవొంచే దానిని కాను నీ దొరతన ముడి దిస్తాను అని ప్రతినేపుడో చేసాను తిమ్మిరి మొత్తం చిమ్ముకోకు నిను అమ్మలక్కలతో దుమ్ముదొలిస్త దారికేదురుగా నిలవబోకు నాతోటి నువ్వు కారు కూతలు వదురబోకు వల్లా నను వురించే రసగుల్లా నీ ప్రతినలు తీరుట కళ్ళ నీ సంఘమంటే ఒక డొల్ల జహ తెల్లవారే సరికల్లా మటుమాయము చేతునే మల్ల తొందరపడకురా నీవింత కనుతెరుస్తుంది జనమంత నీకేదుంచరు పిసరంత నిను పుడ్చీ పెట్టేది వింత అనుకోక తెలుసుకో కొంత చాలు చాలు నీ కలువ కోతలు ఇక జోలె వదులుకొని ఇల్లు చేరుకో దొరనే ఎదురించి నావులే నీకున్న పొగరు పొరను తొలగించుతానులే.. కాలం మారింది ఓ దొరో ఈ రాతిరి నీకు కాలం తీరింది చూడరా... ఓసి పరువాలపొంగులా రాసి ఇక లొంగిపోవే నా దాసి ఓరి నేనింక కాదు నీ దాసి ఈ పూట నేను రాకాసి టెక్కులు ఇంక ఆపేసి మంచాన్ని ఎక్కు వాటేసి పోతాను నిన్ను కాటేసి పూజించుకోరా సన్యాసి రతి పూజలు నీకే చేసి పోతాను లేవే ఆ కాసి రతిని కాదు పార్వతిగా మారి నిను ఖతము చేసి దుర్గతిని బాపెదను కాలం మారింది ఓ దొరో ఈ రాతిరి నీకు కాలం తీరింది చూడరా.. కాలం మారింది ఓ దొరో ఈ రాతిరి నీకు కాలం తీరింది చూడరా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి