చిత్రం: ఒసేయ్ రాములమ్మ(1998 )
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం:వందేమాతరం శ్రీనివాస్ & స్వర్ణలత
ఓ ముత్యాల రెమ్మా ఓ మురిపాల కొమ్మ ఓ పున్నామి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మా రాములమ్మా ఏం చూపులోయమ్మ ఏగు చుక్కనేనమ్మ సిరి నవ్వులోయమ్మ చంద్ర వంకలేనమ్మ ఓ రాములమ్మా రాములమ్మా నువ్వు కడవ మీద కడవ బెట్టి కదిలితేనమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా ఆ కరిమబ్బు వరిదుబ్బు కన్ను గిలిపెనమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా నువ్వు సిందు మీద సిందేసి సెంగుమంటే నమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నావే ఓ రాములమ్మ విచ్చుకోని మొగ్గవోలె పచ్చిపాల నిగ్గువోలె ముచ్చటేసి పోతున్నవే ఓ రాములమ్మ వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే భూమి తల్లి సాక్షిగ నువ్వు క్షేమంగుండాలే సూరిడే నీ వంక తేరి చూసేనమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా అడుగేస్తే నేలంతా అద్దమాయెనమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా పసిడి వన్నె ఒంటి మీద పాడు చూపు పాడకుండా పసుపు పూసినారే అమ్మలు ఓ రాములమ్మ చిట్టి వయసు పారిపోయే సిగురు వయసు చేరెనని చీర కట్టినారే గుమ్మలో ఓ రాములమ్మ దొర గారి దొరసాని దీవెనలా కోసమని ఆ దొర గారి దొరసాని నిండు దీవెనల కోసమని కాళ్ళు మొక్తా బాంచనని వంగినావమ్మా మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా దొరగారి పై ఊగే పంకా వైనావమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా దొరసాని కాల్లొత్తే దూది వైనావమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా దేవిటినే వెలిగించే దివ్వే వైనావమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా నలుగురికి తల్లోని నాల్కవైనావమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా చికటింట బిక్కుమంటు కలత పడ్డ కళ్ళల్లోన బాకులాంటి ఎలుగు మెరిసెనా ఓ రాములమ్మ మూగ బడ్డ వెదురులోన ముచ్చటైన రాగాలూదే ముద్దులయ్య చెయ్యి దొరికేనా ఓ రాములమ్మ కష్టాలు కన్నీళ్లు ఉంటాయా చానాళ్ళు కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా చానాళ్ళు ఇంకా పొదలు మాటు పువ్వుల్లాగ ఒదగాలోయమ్మ గుబులే లేని గువ్వల్లగా ఎగరాలోయమ్మ పచ్చని అడవితల్లి పందిరవుతుందమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా నీరెండే నీ కాలి పారాణవుతుందమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా పూసేటి పూలన్ని పోసే తలంబ్రాలమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా కోయిలల సందడ్లే సన్నాయి మేళాలమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి