6, ఆగస్టు 2021, శుక్రవారం

Swayamvaram : Gali Vanalo Song Lyrics (గాలి వానలో ... వాన నీటిలో ...)

చిత్రం:  స్వయంవరం(1982)

సంగీతం: సత్యం

సాహిత్యం: దాసరి నారాయణ రావు

గానం: జేసుదాస్



గాలి వానలో ... వాన నీటిలో ... గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం .. తెలియదు పాపం .. ఇటు హొరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు ఇటు హొరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు హొరు గాలిలో వరద పొంగులో సాగలేలని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇవి నీటి సుడులు అని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇవి సుడులు అని తెలుసు జోరు వానలొ నీటి సుడులలో మునక తప్పదని తెలుసు అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం ... తెలియదు పాపం .... ఇది ఆశ నిరాశల ఆరాటం అది చీకటి వెలుగుల చెలగాటం ఇది ఆశ నిరాశల ఆరాటం అది చీకటి వెలుగుల చెలగాటం ఆశ జారినా వెలుగు తొలిగినా ఆగదు జీవిత పొరాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం ప్రేమ శకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం ... తెలియదు పాపం ... గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం ... తెలియదు పాపం .....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి