చిత్రం: ఒసేయ్ రాములమ్మ(1998 )
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం:వందేమాతరం శ్రీనివాస్
తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగు వన్నాడు నల్లవాడు నేడు నిన్ను నక్సలైటు అన్నాడు ఎల్లవారు రేపు మనల వేగుచుక్కలంటారు రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా గుండె నెత్తురుల పోరు బాటలో కంట నీరులే నింపకమ్మా రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా వీరుల కన్నీటి జల్లు ఆకాశం చూడలేదు వీరమాత కంట తడిని పుడమితల్లి చూడలేదు కన్నీళ్ళతో నీవు కూడ గమ్యాలను చూడలేవు నేనున్నా... లేకున్నా... నేనున్నా లేకున్నా ఎవరేమైపోతున్నా చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా నేను చచ్చిపోతున్నా... రేపే డప్పై పుడతా... నీ ప్రస్థానానికి నే... విప్లవాల దరువవుతా... కాలుతున్న నరం నరం నీ పాటకు స్వరమైతే కమిలే నా కనుపాపలు చూపై నీతో ఉంటయ్ నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా విప్లవమా... వర్ధిల్లు... విప్లవమా వర్దిల్లని వీధి వీధి నినదిస్తా... చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా భగత్-సింగునురిదీస్తే తిరుగుబాటు ఆగిందా సద్దర్ హష్మిని నరికితే పాట మూగబోయిందా ఆగదు మన రగల్జండ పోరాటం ఉప్పెనలా పొంగుతున్న జన తీర్ధం రావద్దు... నాకోసం... రావద్దు నాకోసం బలి కావొద్దు చలో బెహన్ ... కరో జంగ్... ఆజాది చలో బెహన్ ... కరో జంగ్... ఆజాది చలో బెహన్ ... కరో జంగ్... ఆజాది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి